Advertisement

Advertisement


Home > Movies - Movie News

సీనియర్ హీరోయిన్ తెలుగు వెబ్ సిరీస్

సీనియర్ హీరోయిన్ తెలుగు వెబ్ సిరీస్

కాజల్ ఇప్పటికే ఓటీటీలోకి ఎంటరైంది. తమన్న అయితే ఏకంగా ఓటీటీలో రెండు సార్లు బోణీకొట్టింది. రాశిఖన్నా సీక్రెట్ గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి సీనియర్ హీరోయిన్ త్రిష కూడా చేరింది. అవును.. త్రిష కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక్కడ విశేషం ఏంటంటే.. త్రిష తెలుగులో వెబ్ సిరీస్ చేస్తోంది. సోనీ లివ్ అనే ఓటీటీ యాప్ కోసం త్రిష ఇలా ముందుకొచ్చింది. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. త్రిష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపిస్తుందంటున్నారు. ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు.

ఈ వెబ్ సిరీస్ లో మరో 2 ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ట్ డైరక్టర్ గా టాలీవుడ్ లో బిజీగా ఉన్న అవినాష్ కొల్ల, ఈ సిరీస్ తో నిర్మాతగా మారాడు. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ వెబ్ సిరీస్ కు ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు ప్రేక్షకుల దృష్టిలో త్రిష ఫేడవుట్ హీరోయిన్. కానీ తమిళనాట ఆమెకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మణిరత్నం తీస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాటు చేతిలో మరో 2 సినిమాలున్నాయి. ఓవైపు ఇలా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఓటీటీలో కూడా అడుగుపెట్టింది త్రిష. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?