‘త్రివిక్రమ్’ డైలాగ్ పై త్రినాథరావు స్పందన

“మనకి కావాల్సిన వాళ్లకు చేస్తే మోసం, మనకి కావాలి అనుకున్నవాళ్ల కోసం చేస్తే న్యాయం” ధమాకా ట్రయిలర్ లో ఓ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ కు కౌంటర్ గా “త్రివిక్రమ్ మీకు చుట్టమా…

“మనకి కావాల్సిన వాళ్లకు చేస్తే మోసం, మనకి కావాలి అనుకున్నవాళ్ల కోసం చేస్తే న్యాయం” ధమాకా ట్రయిలర్ లో ఓ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ కు కౌంటర్ గా “త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్” అంటాడు రవితేజ. ఈ క్లిప్ ఒక్కటి చాలా వైరల్ అయింది. ధమాకా ట్రయిలర్ లో త్రివిక్రమ్ ను 'వాడిన' విధానం అందర్నీ ఆకట్టుకుంది.

దీనిపై ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన స్పందించాడు. త్రివిక్రమ్ గొప్పదనాన్ని చెప్పే విధంగానే ఆ డైలాగ్ పెట్టాం తప్ప, కించపరచడానికి కాదన్నాడు. అంతేకాదు, దీన్ని త్రివిక్రమ్ కూడా ఎంజాయ్ చేశాడంట.

“ట్రయిలర్ లో కంటే సినిమాలో ఆ డైలాగ్ ఇంకా బాగుంటుంది. త్రివిక్రమ్ గురించి రాసిన డైలాగ్ ని ఆయన చాలా ఎంజాయ్ చేశారు. స్వయంగా ఫోన్ చేసి చాలా సరదాగా మాట్లాడారు. అది ఇరికించిన డైలాగ్ కాదు, సినిమాలో ఫ్లోలో వస్తుంది. హీరో క్యారెక్టర్ అలాంటిది.”

ఇలా త్రివిక్రమ్ పై పెట్టిన డైలాగ్ ను సమర్థించుకున్నాడు నక్కిన. ఇక రవితేజపై పెట్టిన 'బ్యాక్ గ్రౌండ్' డైలాగ్ ను కూడా సమర్థించుకున్నాడు.  

చాలా మంది ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటేనే రాణించగలమని అనుకుంటారని, కానీ బ్యాగ్రౌండ్ లేకుండా కూడా ఇక్కడ రాణించవచ్చని రవితేజ లాంటి హీరోతో చెప్పిస్తే అందరికీ ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ డైలాగ్ పెట్టామని వివరణ ఇచ్చుకున్నాడు.