దర్శకుడు త్రివిక్రమ్ కు కాస్త సెంటిమెంట్లు ఎక్కువే. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు అ..అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ పెడతారన్న సంగతీ తెలిసిందే.
అలాగే కమెడియన్ బ్రహ్మానందం కూడా త్రివిక్రమ్ కు సెంటిమెంట్. ఆయన సినిమాల్లో బ్రహ్మనందం ఓసారి అయిన తళుక్కున మెరవాల్సిందే. అత్తారింటికి దారేది తరువాత ఈ సెంటిమెంట్ మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను భీమ్లానాయక్ కు కూడా పాకించారు. కేవలం బ్రహ్మీ కోసమే త్రివిక్రమ్ ఓ పాత్రను క్రియేట్ చేసారని తెలుస్తోంది. బ్రహ్మీకి ఈ పాత్ర మళ్లీ ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. బ్రహ్మానందం పాత్ర క్లయిమాక్స్ లో కనిపిస్తుందని తెలుస్తోంది
ఇటీవలి కాలంలో సరైన పాత్ర పడక బ్రహ్మానందం సినిమాలు తగ్గాయి. ఆయన కోసం మంచి పాత్రలు తయారుచేయలేకపోతున్నారు. దాంతో ఫన్ పండడం లేదు.
కానీ భీమ్లాలో మాత్రం త్రివిక్రమ్ తన స్టయిల్ ఫన్ ను బ్రహ్మీ ద్వారా పండించబోతున్నారట. ఎంత వరకు పండుతుందో సినిమా వస్తే కానీ తెలియదు.