ఉన్నట్లుండి ఓ ట్వీట్..సితార సంస్థ నుంచి త్వరలో ఓ బ్లాస్టింగ్ ప్రకటన అంటూ. అంతలోనే దాన్ని డీ కోడ్ చేస్తూ వార్తలు. బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రకటన అంటూ. కానీ ఇదే ఇప్పుడు పలు సందేహాలకు దారితీస్తోంది.
మహేష్ సినిమా ఇంకా ఆరంభంలోనే వుంది. అటు బన్నీ చేస్తున్న పుష్ప 2 సినిమా సెట్ మీదే వుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అనౌన్స్ మెంట్ ఎందుకు వస్తోంది అన్నది ప్రశ్న.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న గ్యాసిప్ ల ప్రకారం చూసుకుంటే బన్నీ కావాలని ఈ ప్రకటనను అర్జెంట్ గా విడుదల చేయిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్-మహేష్ సినిమా షూట్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. దీని మీద మహేష్ కాస్త అసంతృప్తిగానే వున్నారు. మహేష్ ఫ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా అసంతృప్తిగా వున్నారు. వేకప్ గుంటూరు కారం టీమ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసారు కూడా. అదే టైమ్ లో త్రివిక్రమ్-బన్నీ కలిసి చేసి ఆహా ప్రకటన విడుదలయింది. ఇది మహేష్ ఫ్యాన్స్ ను మరింత గిచ్చినట్లు అయింది. తమ హీరో సినిమా తప్ప త్రివిక్రమ్ అన్నీ చేస్తున్నారని ఫ్యాన్స్ గోల పెట్టడం పెరిగింది.
ఇలాంటి టైమ్ లో త్రివిక్రమ్-బన్నీ సినిమా ప్రకటన అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పైగా మహేష్ వద్దనుకుంటున్నారంటూ వినిపిస్తున్న థమన్ పేరు ఆ సినిమాకు వుంటుందంటున్నారు. ఇది కూడా కాస్త ఇబ్బంది కరమైన విషయమే. ఇలా ఇప్పుడు బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రకటన రావడం మహేష్ ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బంది పెట్టే సంగతే.