కారు కొన్నాడు.. మళ్లీ ట్రోల్ అయ్యాడు

‘ది గోట్’ అనే సినిమా తీసి తీవ్ర విమర్శల పాలయ్యాడు దర్శకుడు వెంకట్ ప్రభు. అప్పటివరకు సంపాదించుకున్న క్రేజ్ ను ఒక్క సినిమాతో పోగొట్టుకున్నాడు. తమిళనాడులో మినహా ‘ది గోట్’ సినిమా ఏ రాష్ట్రంలో…

‘ది గోట్’ అనే సినిమా తీసి తీవ్ర విమర్శల పాలయ్యాడు దర్శకుడు వెంకట్ ప్రభు. అప్పటివరకు సంపాదించుకున్న క్రేజ్ ను ఒక్క సినిమాతో పోగొట్టుకున్నాడు. తమిళనాడులో మినహా ‘ది గోట్’ సినిమా ఏ రాష్ట్రంలో ఆడలేదు.

అతడు ఆ సినిమాను ఎలా తీశాడనే సంగతి పక్కనపెడితే, విడుదల తర్వాత చేసిన ప్రకటనలు అతడి ఇమేజ్ ను మరింత దెబ్బతీశాయి. చెన్నైసూపర్ కింగ్స్ ను చూపించడం వల్లనే మిగతా రాష్ట్రాల జనాలు ‘ది గోట్’ ను ఇష్టపడలేదని ఓసారి అన్నాడు. మరో సందర్భంలో తను సమీక్షకుల కోసం సినిమా తీయలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అలా తన వ్యాఖ్యలతో దాదాపు 3-4 రోజుల పాటు ట్రోలింగ్ కు గురయ్యాడు వెంకట్ ప్రభు. ఇక అంతా సద్దుమణిగిందనుకున్న టైమ్ లో ఈ డైరక్టర్ పై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. దీనికి కారణం, అతడు తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడమే.

రీసెంట్ గా 80 లక్షలు పెట్టి ఓ కారు కొన్నాడు వెంకట్ ప్రభు. ఇది చాలామందికి కోపం తెప్పించింది. చెత్త సినిమాతో మాకు తలనొప్పులు తెప్పించి, నువ్వు కారు కొనుక్కుంటావా అంటూ మరోసారి అతడిపై విరుచుకుపడుతున్నారు జనం. ఈ సినిమాలో విజయ్ హీరోగా ఉన్నాడు కాబట్టి కనీసం కోలీవుడ్ లోనైనా ఆడింది. లేదంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యేదంటూ పోస్టులు పెడుతున్నారు.

విజయ్ చివరి చిత్రం ఇదే..

ఓవైపు ఈ విమర్శలు, వివాదాలు ఇలా కొనసాగుతుండగానే.. విజయ్ తన కెరీర్ లో 69వ చిత్రాన్ని ప్రకటించాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హెచ్.వినోత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇదే విజయ్ చేయబోయే ఆఖరి సినిమా. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీని పూర్తిచేసి, పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడు విజయ్. 2026లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

13 Replies to “కారు కొన్నాడు.. మళ్లీ ట్రోల్ అయ్యాడు”

  1. ప్రతిపక్షం లేని రాష్ట్రంలో పార్టీ పెట్టిన ఇతను తప్పక చరిత్ర సృష్టిస్తాడు

  2. ఈ విజయ్ చివరి సినిమా రెమ్యూనరేషన్ 250 కోట్లని చెన్నై సర్కిల్లో టాక్ నడుస్తుంది…. నిజమో కాదో మరి….

  3. ఈ విజయ్ చివరి సినిమా రెమ్యూనరేషన్ 250 కోట్లని చెన్నై సర్కిల్లో టాక్ నడుస్తుంది….

  4. ఈ విజయ్ చివరి సినిమా రెమ్యూ నరేషన్ 250 కో ట్లని చెన్నై సర్కిల్లో టా క్ నడుస్తుంది…. నిజమో కాదో మరి….

  5. ఈ విజ య్ చి వ రి సి ని మా రె మ్యూ నరేషన్ 2 5 0 కో ట్ల ని చెన్నై స ర్కిల్లో టా క్ న డు స్తుంది….

Comments are closed.