కేటీఆర్ దిద్దుబాటు చ‌ర్య‌లు

తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భంలో కేసీఆర్ ప‌దేప‌దే ఆంధ్రోళ్లంటూ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేవారు. కేసీఆర్ కామెంట్స్‌తో తెలంగాణ స‌మాజం కూడా రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, కోస్తా ప్రాంత‌వాసుల్ని శ‌త్రువులుగా చూసేవారు. తెలంగాణ ఏర్ప‌డితే, ఆంధ్ర ప్రాంత వాసులు…

తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భంలో కేసీఆర్ ప‌దేప‌దే ఆంధ్రోళ్లంటూ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేవారు. కేసీఆర్ కామెంట్స్‌తో తెలంగాణ స‌మాజం కూడా రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, కోస్తా ప్రాంత‌వాసుల్ని శ‌త్రువులుగా చూసేవారు. తెలంగాణ ఏర్ప‌డితే, ఆంధ్ర ప్రాంత వాసులు ముఖ్యంగా హైద‌రాబాద్‌ను విడిచి వెళ్లాల్సి వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ్డారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. హైద‌రాబాద్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసులు ప్ర‌శాంతంగా బ‌తుకుతున్నారు.

ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి త‌న పార్టీకే చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు చేసే క్ర‌మంలో, మ‌ళ్లీ ఆంధ్రా వాళ్ల‌ను తెర‌పైకి తేవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కౌశిక్‌రెడ్డిని చాలా మంది త‌ప్పు ప‌ట్టారు. హైద‌రాబాద్‌లో ఆంధ్రా ప్రాంత వాసులు రాజ‌కీయంగా బీఆర్ఎస్‌కు అండ‌గా నిలిచిన రోజుల్ని కౌశిక్‌రెడ్డి మ‌రిచిపోయిన‌ట్టున్నారే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్ర‌మంలో కౌశిక్‌రెడ్డి నోటి దురుసు వ‌ల్ల క‌లిగిన న‌ష్టం నుంచి బ‌య‌ట ప‌డేందుకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇవాళ కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లి, ఆయ‌న్ను పరామ‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు.

బ‌త‌క‌డానికి వ‌చ్చిన ఆంధ్రోళ్లు అన్న కౌశిక్‌రెడ్డి కామెంట్స్‌ను సున్నితంగానే కేటీఆర్ సైడ్ చేశారు. హైద‌రాబాద్‌లో ఉన్న ప్ర‌జ‌లంతా త‌మ వాళ్లే అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రాంతీయ త‌త్వంతో దాడులు గ‌తంలో కూడా లేవ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇప్పుడూ వుండ‌వ‌న్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌కు అండ‌గా నిలిచార‌న్నారు. పీఏసీ ప‌ద‌వి కోసం దిక్కుమాలిన మాట‌లు మాట్లాడిన అరికెపూడి గాంధీకి సిగ్గుండాల‌ని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. గాంధీ ఏ పార్టీలో వుండారో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

10 Replies to “కేటీఆర్ దిద్దుబాటు చ‌ర్య‌లు”

  1. ఇవాళ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి, ఆయన్ను పరామర్శించారు.. //

    వాడి తాలూకా ఎవరైనా పొయారా ? లేక వాడికి అనారోగ్యం (మానసిక) ఉందా ? పరామర్శించడానికి ?

  2. అంద్రొడు పెట్టిన రాజకియ బిక్ష తొ రాజికియాలు చెసి కొడుక్కి కూడ అంద్రొడి పెరి పెట్టి ..

    మళ్ళి అంద్రొడి సం.,,క నా.,కడం ఎందుకురా కు.,..క్కల్లారా

  3. చంద్ర బాబు గారు మీరు ఒకసారి తెలంగాణ లో అడుగు పెట్టే చచ్చి పోయిన టీఆర్ఎస్ పార్టి నీ బతికించండి, వేరే దిక్కు లేదు.

Comments are closed.