హీరోయిన్లపై ట్రోలింగ్ కొత్త కాదు. దాదాపు ప్రతి హీరోయిన్ కు ఏదో ఒక దశలో ట్రోలింగ్ ఎదురవుతుంది. దాన్ని ఎంత బాగా ఎదుర్కొంటే, హీరోయిన్లు అంత రాటుదేలుతారు. ఇలాంటి ట్రోలింగ్స్ తమన్నకు కూడా కొత్త కాదు. అయితే ఆమె అందంపై మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ విమర్శలు చెలరేగలేదు. అలాంటిది తొలిసారిగా తమన్న లుక్స్ పై ట్రోలింగ్ మొదలైంది.
షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ దొరకడంతో రిలాక్స్ అవ్వడం కోసం మాల్దీవులకు వెళ్లింది తమన్న. రంగురంగుల దుస్తుల్లో బీచ్ లో అందాలు ఆరబోస్తూ ఫొటోలు దిగుతోంది. వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే ఈ ఫొటోల్లో ఆమె ఏమంత గ్లామరస్ గా కనిపించడం లేదు. అలా అని అవి మేకప్ లేకుండా దిగిన ఫొటోలు కూడా కావు.
దీంతో తొలిసారి తమన్న అందంపై ట్రోల్స్ పడుతున్నాయి. అందానికే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ, అందరితో మిల్కీబ్యూటీ అనిపించుకున్న తమన్న, నిజంగానే ఈ పిక్స్ లో తన కళ కోల్పోయింది. లెగ్స్ కనిపించేలా ట్రెండీ డ్రెస్ వేసినప్పటికీ, ఆమె ముఖంలో మునుపటి మెరుపు లేదు. ఇదే ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. అదే టైమ్ లో చర్చకు కూడా దారితీసింది.
ఈమధ్య కరోనా బారిన పడింది తమన్న. ఆ తర్వాత నుంచి ఆమె అందంలో, ఫిజిక్ లో మార్పులు చోటుచేసుకున్నాయని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం వయసుతో వచ్చిన మార్పు అంటున్నారు. ఆమె ఇండస్ట్రీకొచ్చి 17 ఏళ్లు అయిపోయింది. ఇప్పుడామె వయసు కూడా 32 ఏళ్లు. కాబట్టి ముఖవర్ఛస్సులో కాస్త తేడా వచ్చి ఉంటుందని మరికొందరు అంటున్నారు
ఏదేమైనా తమన్న లుక్స్ మాత్రం మారిపోయాయి. రీసెంట్ గా ఎఫ్3 సినిమా వర్కింగ్ స్టిల్స్, వీడియో రిలీజయ్యాయి. అందులో కూడా ఆమె కాస్త బొద్దుగా కనిపించింది. దాదాపు ఇదే తరహా డ్రెస్ వేసుకుంది.