నాకు కరోనా రాలేదు – నటుడు ప్రభాకర్

టీవీ ఆర్టిస్టు ప్రభాకర్ కు కరోనా సోకింది. దీంతో సీరియల్ ఆర్టిస్టులంతా షాక్ అయ్యారు. వరుసపెట్టి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది సినీప్రముఖులు కూడా ప్రభాకర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. అయితే ఈ…

టీవీ ఆర్టిస్టు ప్రభాకర్ కు కరోనా సోకింది. దీంతో సీరియల్ ఆర్టిస్టులంతా షాక్ అయ్యారు. వరుసపెట్టి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది సినీప్రముఖులు కూడా ప్రభాకర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఓ ప్రభాకర్ కు కరోనా సోకింది. మరో ప్రభాకర్ కు పరామర్శల పర్వం మొదలైంది.

సీరియల్స్ లో నటించే బొడ్డు ప్రభాకర్ అనే ఆర్టిస్టుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ అందరూ మరో ప్రభాకర్ అని అనుకున్నారు. అతడే ప్రభాకర్ పొడకండ్ల. బుల్లితెరపై ప్రభాకర్ అంటే అందరికీ ఇతడే సుపరిచితం. ఈటీవీ నుంచి మొదలుపెట్టి జీ తెలుగు వరకు చాలా సీరియల్స్ లో ఈ ప్రభాకర్ నటించాడు.

కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా.. చాలా సినిమాల్లో నటించాడు ప్రభాకర్. ఓ 2 సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. అలా బాగా పాపులర్ అవ్వడంతో ప్రభాకర్ కు కరోనా సోకిందనే వార్త రావడంతో అంతా ఈ ప్రభాకరే అనుకున్నారు. పైగా కొన్ని సైట్లు ఈ ప్రభాకర్ ఫొటోను కూడా వాడేసి కరోనా వార్తలు వండేశాయి. దీంతో తను సేఫ్ గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది ప్రభాకర్.

మరోవైపు బొడ్డు ప్రభాకర్ కు కరోనా సోకడంతో టీవీ సీరియల్స్ షూటింగ్స్ అన్నీ డైలమాలో పడ్డాయి. ఈరోజు నుంచి నటీనటులు ఎవ్వరూ షూటింగ్స్ లో పాల్గొనవద్దని తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆదేశాలు జారీచేసింది.

దీంతో సరిగ్గా వారం కిందట ప్రారంభమైన సీరియల్స్ మళ్లీ ఆగిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఈరోజు మరోసారి అసోసియేషన్ సభ్యులు సమావేశమై తుదినిర్ణయం తీసుకోబోతున్నారు.

ముఠా నాయకుడు బైటకు రావాలి