బాహుబలి ప్రభాస్ ఫుల్ జోష్ మీద వున్నారు. నాగ్ అశ్విన్ తో ఓ పాన్ ఇండియా సినిమా కు సైన్ చేసిన కొద్ది నెలలకే బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ డైరక్షన్ లో మరో భారీ సినిమాకు పచ్చ జెండా ఊపారు. ఇదే టైమ్ లో త్వరలో కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తారు అని గ్రేట్ ఆంధ్ర కొన్నాళ్ల క్రితమే వెల్లడించింది.
ఇవ్వాళో, రేపో ఆ సినిమా ప్రకటన ఇవ్వడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన యువి అధినేత వంశీ తండ్రి మరణించారు. దాంతో ప్రభాస్ తో సహా అందరూ విషాదంలో మునిగిపోయారు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన ను నిలిపివేసినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది.
వంశీ తండ్రి, పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి వంశీ సన్నిహితులు హీరోలు రామ్ చరణ్, శర్వానంద్ లు హాజరయ్యారు. ఈ విషాదం నుంచి కోలుకున్నాక, ప్రభాస్-ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన వుండే అవకాశం వుంది.