కొన్ని రోజుల కిందటి సంగతి.. సడెన్ గా “వైల్డ్ డాగ్” టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేశాడు నాగార్జున. నాగ్ అందులో స్పెషల్ ఏజెంట్ గా కనిపిస్తున్నాడనే విషయం అర్థమైనప్పటికీ.. ఆ వైల్డ్ డాగ్ అనే పేరు ఎందుకు పెట్టారో చాలామందికి అర్థంకాలేదు.
అప్పట్నుంచి ఆ చిక్కుముడి అలానే ఉంది. ఎట్టకేలకు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈరోజు “వైల్డ్ డాగ్” అర్థమేంటో చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్ని పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున పాత్ర పేరు విజయ్ వర్మ. కానీ డిపార్ట్ మెంట్ లో అందరూ ఇతడ్ని వైల్డ్ డాగ్ అని పిలుస్తారు. అదే ఇతడి నిక్ నేమ్ అనే విషయాన్ని ఈరోజు రిలీజైన పోస్టర్ తో రివీల్ చేశారు.
ఎన్ఐఏలో ఉంటూ 12 కీలకమైన మిషన్స్ పూర్తిచేసిన వైల్డ్ డాగ్ గా నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. నాగ్ తో పాటు ఇతర కీలక పాత్రల్ని కూడా బయటపెట్టారు.
ఇక సినిమా విషయానికొస్తే.. “వైల్డ్ డాగ్” షూటింగ్ ఇప్పటివరకు 70శాతం పూర్తయింది. ఈ మూవీతో వంశీ పైడిపల్లి శిష్యుడు సోలోమన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. దియా మీర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లు. వాళ్ల లుక్స్ ఇంకా రివీల్ చేయలేదు.