ఉపాస‌న ‘ప్రేమ’ సూక్తులు

హీరో రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక అంశాల‌పై ఆమె స్ఫూర్తిదాయ‌క కామెంట్స్ చేస్తుంటారు. అవ‌స‌ర‌మైతే ఏ స్థాయి వ్య‌క్తుల‌నైనా ఆమె ప్ర‌శ్నిస్తారు. మహాత్మా గాంధీ 150వ జయంతి…

హీరో రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక అంశాల‌పై ఆమె స్ఫూర్తిదాయ‌క కామెంట్స్ చేస్తుంటారు. అవ‌స‌ర‌మైతే ఏ స్థాయి వ్య‌క్తుల‌నైనా ఆమె ప్ర‌శ్నిస్తారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలని పురస్కరించుకుని మోడీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్ లని ఆహ్వానించారు. కానీ సౌత్ ఇండియా ప్ర‌ముఖులెవ‌రినీ ఆహ్వానించ‌లేదు.

ఈ సంద‌ర్భంలో ఉపాస‌న ట్విట‌ర్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. భార‌త చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ద‌క్షిణాది వారు కూడా భాగ‌మ‌ని , ఇక్క‌డున్న సినీ దిగ్గ‌జాల‌ని కూడా ఆహ్వానించి ఉండాల్సింద‌ని ఉపాస‌న మోడీకి ట్వీట్ చేశారు. అప్ప‌ట్లో ఉపాస‌న ట్వీట్ దేశ వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌న‌మైంది. ఆమెకు సౌత్ ఇండియా సినీ ఇండ‌స్ట్రీ మ‌ద్ద‌తుగా నిలిచింది.

 తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆమె ఓ  ట్వీట్ చేశారు. అది సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. మానవ సంబంధాలు బలపడాలంటే ఏం చేయాలో ఆమె చెప్పారు. ముఖ్యంగా నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అని ఉపాసన అంటున్నారు. ఈ వాలంటైన్స్‌ డే రోజున బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించిన ఉపాసన..   కొన్ని సూచనలు కూడా చేశారు.

‘మొదట నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే ఎలాంటి షరతులు లేకుండా ఇతరులను ప్రేమించే దృష్టి అలవడుతుంది. నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో. నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేయి. నీ మొత్తం ప్రపంచం మార్పుకు సాక్ష్యంగా నిలువు’ అని పేర్కొన్నారు.

 ఉపాసన ట్వీట్‌పై నెటిజ‌న్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.  చాలా బాగా చెప్పారని ఆమె ట్వీట్‌పై నెటిజ‌న్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతూ ఉపాస‌న‌కు అభినంద‌న‌లు చెప్ప‌డం విశేషం.