అందమైన అమ్మాయిని చూస్తే ఎవరైనా ఇలానే అనుకుంటారు. ఇంకాస్త మాస్ జనాలైతే ఏం పెట్టి చేసిందిరా బాబూ ఆ నడుము అంత నాజూగ్గా ఉందని కూడా కామెంట్స్ చేస్తారు. ఊర్వశి రౌథేలాను చూస్తే ఈ కామెంట్స్ అన్నీ నిజం అనిపిస్తాయి. ఇన్నేళ్లు గడిచినా చెక్కుచెదరని ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది ఈ బ్యూటీ.
ఊర్వశి తన రోజును యోగా, ప్రాణాయామంతో స్టార్ట్ చేస్తుంది. దీంతో పాటు కొన్ని ఎక్సర్ సైజులు చేస్తుంది. ప్రతి రోజూ యోగా చేస్తుంది కానీ జిమ్ చేయదు. వారానికి 3 రోజులు మాత్రమే జిమ్. అంతేకాదు, కఠోరమైన వెయిట్ ట్రయినింగ్ ప్రొగ్రామ్ లో కూడా పాల్గొంటుంది.
మరిన్ని కెలొరీలు కరగాలంటే యోగా, జిమ్ తో పాటు డాన్స్ కూడా చేయాలంటోంది ఈ బ్యూటీ. ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా డాన్స్ చేస్తుంది. దీని వల్ల 2 ఉపయోగాలు. డాన్స్ ప్రాక్టీస్ తో పాటు జిమ్ కూడా చేసినట్టు అవుతుంది.
ఇక ఊర్వశి కి ప్రత్యేకంగా డైట్ ప్లాన్ అంటూ లేదు. చిన్నప్పట్నుంచి తింటున్న ఆహారమే తింటుందంట. స్నాక్స్ కింద తాజా పండ్లు, బాదం తింటుంది.
బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్, ఎగ్ వైట్ ఆమ్లెట్, మల్టీగ్రెయిన్ టోస్ట్ తింటుంది. లంచ్ లో లెంటిల్స్, వెజిటబుల్స్, రోటీ, బ్రౌన్ రైస్ తీసుకుంటుంది.
ఇక డిన్నర్ లో చాలా లైట్ ఫుడ్ తీసుకుంటుంది ఊర్వశి. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత అంతా రిపీట్. ఫుడ్ తో పాటు ముఖానికి నాచురల్ ప్రొడక్ట్స్ వాడుతుందట ఊర్వశి.