రకుల్ తో రొమాన్స్ కంటే.. గొర్రెలు కాయడం ఈజీ

కొండపొలం సినిమాలో యాక్షన్ తో పాటు మంచి రొమాన్స్ కూడా ఉందంటున్నాడు హీరో వైష్ణవ్ తేజ్. సినిమాలో అదే తనకు పెద్ద ఇబ్బందిగా మారిందని కూడా చెప్పుకొచ్చాడు. వెయ్యి గొర్రెల్ని కాసినప్పుడు కూడా తనకు…

కొండపొలం సినిమాలో యాక్షన్ తో పాటు మంచి రొమాన్స్ కూడా ఉందంటున్నాడు హీరో వైష్ణవ్ తేజ్. సినిమాలో అదే తనకు పెద్ద ఇబ్బందిగా మారిందని కూడా చెప్పుకొచ్చాడు. వెయ్యి గొర్రెల్ని కాసినప్పుడు కూడా తనకు ఇబ్బంది అనిపించలేదని, రకుల్ తో రొమాన్స్ చేసినప్పుడు మాత్రం ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు.

“గొర్రెల కాపరిగా చేయడం ఈజీ అనిపించింది. డిక్షన్ నేర్చుకున్నాను, గొర్రెలు కాయడం కూడా నేర్చుకున్నాను. కానీ రొమాన్స్ చేయడం మాత్రం చాలా చాలా ఇబ్బంది అయింది. రకుల్ తో రొమాన్స్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డాను. నిజానికి రకుల్ అనే కాదు, ఏ హీరోయిన్ తోనైనా రొమాంటిక్ సీన్స్ అంటే నాకు కొంచెం ఇబ్బంది.”

కొండపొలం రొమాంటిక్ సీన్స్ లో తన టెన్షన్ పోగొట్టేలా రకుల్, బాగా కోపరేట్ చేసిందంటున్నాడు వైష్ణవ్. కేవలం రకుల్ సహకారం వల్లనే ఆ సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయన్నాడు. మొదటి సినిమా ఉప్పెనలో మాత్రం రొమాన్స్ సీన్లకు ఇబ్బంది పడలేదన్నాడు.

“ఉప్పెనలో కూడా రొమాన్స్ చేశాను. కానీ టెన్షన్ పడలేదు. ఎందుకంటే కృతిషెట్టికి కూడా అదే మొదటి సినిమా. కానీ కొండపొలంలో నేను జూనియర్, రకుల్ చాలా చాలా సీనియర్. అంత సీనియర్ తో రొమాన్స్ అంటే కొంచెం టెన్షన్ వచ్చింది.”

రేపు థియేటర్లలోకి రాబోతోంది కొండపొలం సినిమా. క్రిష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు.