వకీల్ సాబ్ లో ఓ సర్ప్రయిజ్ ఎలిమెంట్ అంటూ డైరక్టర్ వేణు శ్రీరామ్ చిన్న ఫీలర్ వదలిన దగ్గర నుంచి ఎవరి ఊహాగానాలు వారు చేసేసుకున్నారు.
మెగాస్టార్ కనిపిస్తారని, కాదు రామ్ చరణ్ అని ఇలా ఎవరికి తోచింది వారు. తాను చెప్పింది వికటించేలా వుందని పాపం డైరక్టర్ నే ఎక్కువ ఊహించుకోవద్దు అని క్లారిటీ ఇచ్చేసాడు.
అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం వకీల్ సాబ్ ఆరంభంలో వచ్చే 'మగువ..మగువా' సాంగ్ మళ్లీ సెకండాఫ్ లో వస్తుంది. అయితే ఇప్పటి వరకు వైరల్ అయిన మేల్ వెర్షన్ కాదు.
ఫిమేల్ వెర్షన్. ఇది ఇంకా బయటకు రాలేదు. దీన్ని సెకండాఫ్ లో ప్లే చేస్తారు. అదే సర్ప్రయిజ్..అంత కన్నా మరేం కాదు అని తెలుస్తోంది.