ఎక్కువ ఊహించుకోవద్దు.. వకీల్ సాబ్ దర్శకుడు

“సినిమా గురించి ఎంతైనా ఊహించుకోండి. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి. దానికి రెండింతలు ఎక్కువగానే మా సినిమా ఉంటుంది.” విడుదలకు ముందు మేకర్స్ చెప్పే కామన్ డైలాగ్ ఇది. కానీ వకీల్ సాబ్ దర్శకుడు వేణు…

“సినిమా గురించి ఎంతైనా ఊహించుకోండి. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి. దానికి రెండింతలు ఎక్కువగానే మా సినిమా ఉంటుంది.” విడుదలకు ముందు మేకర్స్ చెప్పే కామన్ డైలాగ్ ఇది. కానీ వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ మాత్రం దీనికి రివర్స్ లో చెబుతున్నాడు. మరీ ముఖ్యంగా వకీల్ సాబ్ లో ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ గురించి వేణు శ్రీరామ్ ఇలా స్పందించడం విశేషం.

వకీల్ సాబ్ సెకెండాఫ్ లో ఓ సర్ ప్రైజ్ ఉందంటూ కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. ఆ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అనే అంచనాలు పవన్ అభిమానుల్లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని గమనించిన వేణు శ్రీరామ్ ఓపెన్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. సినిమా సెకెండాఫ్ లో వచ్చే ఆ సర్ ప్రైజ్ గురించి ఎక్కువగా ఊహించుకోవద్దని సూచిస్తున్నాడు.

“సెకెండాఫ్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ లో ఎలాంటి గెస్ట్ ఎప్పీయరెన్స్ లు లేవు. ముందు ఈ విషయాన్ని అంతా తెలుసుకోవాలి. వేరే ఆర్టిస్టులు ఎవ్వరూ కనిపించరు. మ్యూజిక్ పరంగా ఓ చిన్న సర్ ప్రైజ్ మాత్రమే ఇది. నిజానికి ఇది ట్విస్ట్ కాదు. ఆడియన్స్ అబ్బా అనుకునే సీన్ కాదు.”

ఇలా సెకెండాఫ్ లో ఉన్న సర్ ప్రైజ్ ఎలిమెంట్ పై పెరిగిపోతున్న అంచనాల్ని తగ్గించే ప్రయత్నం చేశాడు వేణు శ్రీరామ్. వాస్తవానికి దాన్ని దాచిపెట్టాలనే ఆలోచన తనకు లేదని, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో చెప్పేద్దామనుకుంటే ఫ్యాన్స్ వద్దనడంతో ఆగిపోయానని వెల్లడించాడు.