ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లనున్నారు. ఈ నెల 14న జగన్ తిరుపతి నియోజకవర్గం పరిధిలో ప్రచార సభలో పాల్గొంటారని సమాచారం. ఇప్పటికే అందుకు ఏర్పాట్లు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ఇప్పటికే హోరాహోరీ రీతిన సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి తరఫున ఆ పార్టీల ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక నారా లోకేష్ తిరుపతి పరిధిలోనే మకాం పెట్టి ప్రచారం సాగిస్తూ ఉన్నారు.
మరోవైపు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా ఎనిమిది రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించనున్నారట. ఒక్కో నియోజకవర్గం పరిధిలో కనీసం ఒక్క రోజు పాటు చంద్రబాబు నాయుడు ప్రచారం సాగుతుందట. ఇక బీజేపీ తరఫున కూడా పక్క రాష్ట్రాల నేతలు ప్రచారానికి రానున్నారు.
ఇలా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తనుంది. ఈ నెల 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇలాంటి 15వ తేదీతో ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ప్రచారానికి పూనుకుంటున్నారు.