లీగల్ Vs ఇల్లీగల్.. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్

పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ వచ్చేసింది. లాయర్ గెటప్ లో ఉన్న పవన్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓ చేతిలో దుష్టుల్ని శిక్షించడం కోసం కర్ర పట్టుకున్న…

పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ వచ్చేసింది. లాయర్ గెటప్ లో ఉన్న పవన్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓ చేతిలో దుష్టుల్ని శిక్షించడం కోసం కర్ర పట్టుకున్న పవన్.. మరో చేతిలో చట్టపరంగా కూడా దుష్టుల్ని శిక్షించేలా “క్రిమినల్ లా” పుస్తకాన్ని పట్టుకుంటాడు.

ఈ స్టిల్ కు కోర్టు హాల్ సెటప్, వివిధ సెక్షన్లు ఉండే కాగితాల ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ లుక్ లో పెద్దగా వేరియేషన్ లేకపోయినా, మోషన్ పోస్టర్ మాత్రం అతడి స్టయిల్ ను ఎలివేట్ చేసింది.

హిందీ, తమిళ్ లో వచ్చిన 'పింక్' వెర్షన్లకు.. తెలుగులో రాబోతున్న వకీల్ సాబ్ కు పవన్ క్యారెక్టరైజేషన్ పరంగా చాలా తేడా ఉంటుందనే విషయాన్ని ఈ మోషన్ పోస్టర్ తెలియజేస్తోంది. కథను అలాగే ఉంచి, పవన్ కోసం క్యారెక్టరైజేషన్ లో చాలా మార్పులు చేశారనే విషయం ఈ మోషన్ పోస్టర్ తో బయటపడింది.

వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నివేత థామస్, అంజలి, అనన్య ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ పెండింగ్ లో ఉంది. అది పూర్తయితే టోటల్ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

ఇడుపులపాయలో జగన్

చంద్ర‌బాబు@25