స్మోకింగ్ చేయడం చాలా కష్టమంటున్న హీరోయిన్

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దేనికైనా రెడీ అంటుంటారు హీరోయిన్లు. మరీ ముఖ్యంగా లిప్ కిస్, అందాల ఆరబోత విషయంలో ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడో హీరోయిన్ కు మాత్రం మరో రకమైన…

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దేనికైనా రెడీ అంటుంటారు హీరోయిన్లు. మరీ ముఖ్యంగా లిప్ కిస్, అందాల ఆరబోత విషయంలో ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడో హీరోయిన్ కు మాత్రం మరో రకమైన అనుభవం ఎదురైంది. అదే స్మోకింగ్ సీన్.

తెరపై గుప్పుగుప్పుమంటూ సిగరెట్ తాగే సన్నివేశం అది. ఆ సీన్ నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానంటోంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పటివరకు అలాంటి సన్నివేశం తనకు ఎదురుకాలేదంటోంది.

“నాయట్టుకి రీమేక్ గా కోటబొమ్మాళి సినిమా వస్తోంది. అయితే దీనికి చాలా మార్పులు చేశారు. మరీ ముఖ్యంగా నా క్యారెక్టర్ ను బాగా పెంచారు. ఈ చిత్రంలో నాకు స్మోకింగ్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇలాంటి సీన్ చేయలేదు. అందుకే ఛాలెంజింగ్‌గా అనిపించింది. క్యారెక్టర్‌‌కి ఆ సీన్ కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది.”

ఇలా తొలిసారి తెరపై స్మోకింగ్ సీన్ లో నటించానని వెల్లడించింది వరలక్ష్మి. 24న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ కంటే మైండ్ గేమ్ ఎక్కువగా ఉంటుందని చెబుతోంది. మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైమ్ లో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెబుతోంది.