వ‌ర్మ లాంటి తింగ‌ర ద‌ర్శ‌కుడే లేడు…ఈ ట్వీటే నిద‌ర్శ‌నం!

రాంగోపాల్‌వ‌ర్మ లాంటి తింగ‌ర ద‌ర్శ‌కుడే లేడంటే అతిశ‌యోక్తి కాదు. టాలీవుడ్‌, బాలీవుడ్‌…ఇలా అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న మార్క్ సినిమాల‌ను తెర‌కెక్కించి గుర్తింపు పొందాడు. ద‌ర్శ‌కులంద‌రి దారి ఒకటైతే….వివాదాస్ప‌ద‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ దారి…

రాంగోపాల్‌వ‌ర్మ లాంటి తింగ‌ర ద‌ర్శ‌కుడే లేడంటే అతిశ‌యోక్తి కాదు. టాలీవుడ్‌, బాలీవుడ్‌…ఇలా అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న మార్క్ సినిమాల‌ను తెర‌కెక్కించి గుర్తింపు పొందాడు. ద‌ర్శ‌కులంద‌రి దారి ఒకటైతే….వివాదాస్ప‌ద‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ దారి మ‌రొక‌టి. త‌న‌దారే సప‌రేట్ అన్న‌ట్టు ఉంటుంది ఆయ‌న వ్య‌వ‌హారం.

తాజాగా ఆయ‌న ట్వీట్ చూస్తే…వ‌ర్మ ఎంత తింగ‌రోడో తెలుస్తుంది. బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అమితాబ్‌, ఆయ‌న కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌, కోడ‌లు ఐశ్వ‌ర్య‌రాయ్‌, మ‌నుమ‌రాలు ఆద్య‌ క‌రోనాకు గురై ముంబై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అమితాబ్ కుటుంబం క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని బాలీవుడ్‌, టాలీవుడ్‌ల‌తో స‌హా దేశ వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆకాంక్షిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ అమితాబ్‌పై చిత్ర‌విచిత్ర‌మైన ట్వీట్ చేసి ఔరా అనిపించాడు. క‌రోనా నుంచి అమితాబ్ కోలుకోవాల‌ని కోరుకోవ‌డం లేదంటూ ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కూ ఆయ‌న ట్వీట్‌లో ఏముందంటే…

‘మీరు కరోనా నుంచి కోలుకుంటారని నాకు తెలుసు. ఎప్పటిలాగే మరింత బలంగా తిరిగి వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకే మీ కోసం నేను ప్రార్ధించను. కరోనా కారణంగా చనిపోతున్న వారి కోసం ప్రార్థిస్తాను’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు.

ఏం చేసినా ఇత‌రుల కంటే భిన్నంగా ఉండాల‌ని వ‌ర్మ భావిస్తుంటాడు. అది మాటైనా, ట్వీటైనా, సినిమా అయినా…ఇది అది అని కాదు…ప్ర‌తి దాంట్లో త‌న‌దంటూ సొంత ముద్ర ఉండాల‌ని వ‌ర్మ ప‌రిత‌పిస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఎదుటి వాళ్లు హ‌ర్ట్ అయినా స‌రే వ‌ర్మ ప‌ట్టించుకోడు. బాలీవు‌డ్‌లో అమితాబ్‌తో వర్మ  సర్కార్ మూవీ సిరీస్‌లను తెరకెక్కించిన విష‌యం తెలిసిందే. త‌న‌కు బాగా తెలిసిన అమితాబ్‌పై వ‌ర్మ వెరైటీ ట్వీట్ చేయ‌డంపై నెటిజ‌న్లు ఏమంటారో చూడాలి మ‌రి!

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను