వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి రెడీ అయ్యారు. వాళ్ల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక తేలాల్సింది పెళ్లి తేది, పెళ్లికి వేదిక మాత్రమే. ఇక్కడే కాబోయే భార్యభర్తలిద్దరూ కిందామీద పడుతున్నారు.
మొన్నటివరకు ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనేది వీళ్ల ఆలోచన. కానీ ఇప్పుడు ప్లాన్స్ మారాయి. ఏదైనా ఫారిన్ కంట్రీలో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరూ ఇప్పటికే కొన్ని దేశాలు, అందులో రిసార్టుల్ని సెలక్ట్ చేశారు. వాటిలోంచి ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది.
3 రోజుల పాటు గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని వీళ్లు నిర్ణయించారు. టోటల్ మెగా కాంపౌండ్ సభ్యులంతా ఈ వేడుకకు వెళ్లబోతున్నారు. పెళ్లి నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటుచేస్తారు.
ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు, శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. పెళ్లి లోపు ఈ రెండు సినిమాల్ని కొలిక్కి తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు వరణ్ తేజ్.
అటు లావణ్య త్రిపాఠి కూడా పెళ్లికి ముందే కమిట్ మెంట్స్ పూర్తిచేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 వెబ్ సిరీస్ లు ఉన్నాయి, ఓ తమిళ సినిమా కూడా ఉంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని, తిరిగి యాక్టింగ్ కెరీర్ కొనసాగిస్తుంది లావణ్య త్రిపాఠి.