పెళ్లి కోసం అన్నీ క్లియర్ చేసిన మెగా హీరో

మరికొన్ని రోజుల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నాడు హీరో వరుణ్ తేజ్. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఇటలీలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. పెళ్లి తర్వాత కొన్ని…

మరికొన్ని రోజుల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నాడు హీరో వరుణ్ తేజ్. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఇటలీలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నారు కూడా.

మరి వరుణ్ తేజ్ సినిమాల పరిస్థితేంటి? ఈ విషయంలో తన నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పనులు పూర్తి చేశాడు వరుణ్ తేజ్. ఈ ఏడాది ఆల్రెడీ గాండీవధారి అర్జున సినిమాను రిలీజ్ చేసిన వరుణ్, ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమాను సెట్స్ పై ఉంచాడు.

ఇప్పుడా సినిమా షూటింగ్ కూడా పూర్తిచేశాడు. 2 వారాలుగా ఈ సినిమా షెడ్యూల్ జరుగుతోంది. తాజాగా చేసిన ప్యాచ్ వర్క్ తో టోటల్ షూట్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్, హీరోయిన్ మానుషి చిల్లర్ ఉన్న ఫొటోను కూడా విడుదల చేశారు.

డిసెంబర్ 8న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఈ సినిమా ప్రమోషన్ టైమ్ కు అందుబాటులోకి రావాలనేది వరుణ్ తేజ్ ప్లాన్.

అయితే వరుణ్ తేజ్ చేతిలో మరో మూవీ కూడా ఉంది. కరుణాకరన్ దర్శకత్వంలో మట్కా అనే మూవీని లాంఛ్ చేశాడు. పెళ్లి తర్వాత ఈ సినిమా షూట్ లో జాయిన్ అవుతాడు. అటు లావణ్య త్రిపాఠి తన చేతిలో ఉన్న ఓ వెబ్ సిరీస్ సగానికి పైగా పూర్తిచేసింది.