చాలా అంటే చాలా నెలల క్రితం ‘గ్రేట్ ఆంధ్ర’ చెప్పిందే నిజమైంది. వరుణ్ తేజ్-లావణ్య ప్రేమలో వున్నారని ఆనాడు చెప్పింది ఈరోజు జరిగిన నిశ్చితార్ధంతో వాస్తవరూపం దాల్చింది. ఈ జంట పెళ్లి కొన్ని నెలల తరువాత జరగనుంది.
సాధారణంగా సెలబ్రిటీలు అందరూ ఇప్పుడు డెస్టినేషన్ మ్యారేజ్ లే చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా శర్వానంద్ పెళ్లి జైపూర్ లో జరిగింది. వరుణ్ తేజ్-లావణ్య లు కూడా ఓ మాంచి డెస్టినేషన్ స్పాట్ లో పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.
ఇందుకోసం చాల ప్రదేశాలు ఈ జంట లిస్ట్ లో వున్నాయట. వాటిలో ఫస్ట్ ప్లేస్ లో వున్నది ఇటలీ అని తెలుస్తోంది. ఇటలీ కాక మరి కొన్ని ప్లేస్ లు పరిశీలనలో వున్నా, ఈ జంట ఇటలీ ని ఫస్ట్ ప్లేస్ లో పెట్డడానికి ఓ చిన్న సెంటిమెంట్ వుందని తెలుస్తోంది.
వరుణ్-లావణ్యల నడుమ స్నేహం చిగురించి, ప్రేమగా మారడానికి పునాది పడింది ఇటలీలోనే అంట. మిస్టర్ సినిమా సందర్భంగా షూటింగ్ కు వెళ్లినపుడు స్నేహం మొదలైందని తెలుస్తోంది.
అప్పటి నుంచి స్నేహంగా వుంటూ, ప్రేమికులుగా మారి, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అందుకే ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.