వీర నర సింహా రెడ్డి ట్రయిలర్ వచ్చేసింది. ఎలా వుంది? ఎలా వుంటుంది? బాలయ్య సినిమా ట్రయిలర్ ఎలా వుండాలో అలాగే వుంది. సీన్ తో సంబంధం లేకుండా పంచ్ డైలాగులు..పనిలో పనిగా, పరోక్షంగా ఆంధ్ర సిఎమ్ జగన్ మీద విసుర్లు.
రకరకాల చిత్ర విచిత్రమైన ఆయధాలు పట్టుకుని ఊచకోత, రక్తపుటేరులు.. మధ్యలో ఒక రొమాంటిక్ పాట..ఓ ఎమోషన్ సీన్. ఇదే ట్రయిలర్. అంతకు మించి ఏమీ లేదు. చెప్పాలంటే సంక్రాంతికి మాత్రమే సరిపోయే ఫక్తు బాలయ్య సినిమా అనిపిస్తోంది.
సీమలో ఎవ్వరూ కత్తి పట్టకూడదని తానే కత్తి పట్టా అన్న పాయింట్ కొత్తగా అనిపించలేదు. జగన్ ప్రభుత్వ నిర్ణయాల మీద, జగన్ మీద బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులు ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే సినిమాలో యాంటీ జగన్ డైలాగులు బుర్రా రాస్తున్నారని ముందే గుసగుసలు వినిపించాయి. పది నిమిషాలు ఏ పబ్ కైనా వెళ్లి నిలబడు అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది అని తన జై బాలయ్య స్లోగన్ ను తానే గుర్తు చేయడం, ఫన్నీగా వుంది.
ట్రయిలర్ లో కథ ఏమీ పెద్దగా తెలియచేయలేదు. సీనియర్ బాలయ్య, యంగ్ బాలయ్య ఇద్దరు పాత్రలు, సీనియర్ బాలయ్య సోదరి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించారు. థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కొత్తగా ఏమీ లేదు.