అన్ని సినిమాల కన్నా సోలో రిలీజ్ సాధించింది. బాలయ్య వీరసింహారెడ్డి. మర్నాడు థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వచ్చింది మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య. వీరసింహా కు వచ్చిన ఊపు, సామాజిక మీడియా హడావుడి మామూలుగా జరగలేదు. కానీ వీరయ్యకు పాపం ఆ అవకాశం దొరకలేదు. పైగా చిన్న గీత ముందు మరింత చిన్న గీత గీసేస్తే మనది కాస్తా పెద్ద గీత అయిపోతుందనే ప్లాన్ తో వెళ్లినవాళ్లూ వున్నారు. ఎలా చేయాలో అంతా చేసారు. కానీ జనాల ముందు ఈ టక్కు టమార విద్యలు పారలేదు.
రెండు సినిమాల చూసిన తరువాత వీరయ్యే ఇంతో అంతో బెటర్ థియేటర్ లో కూర్చొవడానికి అని పామర జనం, మాస్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయినట్ల కనిపించింది. మూడో రోజైన శనివారం పరిస్థితి చూస్తే. రెండో రోజు వీరయ్య బ్రేక్ వేసాడు. మూడో రోజు వారసుడు ఎంతో కొంత బ్రేక్ వచ్చింది. దాంతో పాటు వీరయ్య కూడా వుండనే వుంది. మొత్తం మీద యావరేజ్ గా చూసుకుంటే వీరసింహా కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి.
గమ్మత్తేమిటంటే తొలి రోజు భారీగా సింగిల్ గా విడుదలయింది వీరసింహా. పైగా పార్టీ జనాలు, ‘స్వంత’ జనాలు థియేటర్లకు థియేటర్లు టికెట్ లు కొనేసారు. మర్నాడు సగానికి పైగా థియేటర్లలోనే విడుదలయింది వీరయ్య. అయినా డే వన్ రికార్డు మాత్రం వీరయ్యదే అయింది. కనీసం పది కోట్లు తేడా వుంది టోటల్ లో.
సోమ, మంగళవారాలు ఈ రెండు సినిమాలకు డిసైడ్ ఫ్యాక్టర్లు. ఆ రెండు రోజుల తరువాత బుధవారం నుంచి అసలు లెక్కలు తేలతాయి.