Advertisement

Advertisement


Home > Movies - Movie News

వేణు శ్రీరామ్-నితిన్-దిల్ రాజు

వేణు శ్రీరామ్-నితిన్-దిల్ రాజు

హీరో నితిన్ మొత్తం మూడు సినిమాలు ఓకె చేసేసాడు. ప్రస్తుతం షూటింగ్ నడుస్తున్న వక్కంతం వంశీ సినిమా. దాని తరువాత మైత్రీ మూవీస్-వెంకీ కుడుమల సినిమా. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒకటి రెండు రోజుల్లో వస్తుంది. దాని తరువాత వేణు శ్రీరామ్-దిల్ రాజు కాంబినేషన్ లో మరో సినిమా సైన్ చేసాడు. దాని అప్ డేట్ ఓ వారం గ్యాప్ లో వస్తుంది.

వకీల్ సాబ్ సినిమా తరువాత నుంచి వేణు శ్రీరామ్ ఖాళీగా వుండిపోయారు కథల కసరత్తు సాగిస్తూ వచ్చారు. వేణు శ్రీరామ్ కు ఓ సినిమా సెట్ చేయాలని దిల్ రాజు గట్టిగానే ప్రయత్నించారు. 

వేణు శ్రీరామ్ దగ్గర వున్న ‘తమ్ముడు’ అనే స్క్రిప్ట్ తో నాని హీరోగా ఎంసిఎ కు సీక్వెల్ కూడా ప్లాన్ చేసారు. మరి అది ఎక్కడ వరకు వచ్చి ఆగిందో తెలియదు. ఆఖరికి నితిన్ తో సెట్ అయింది.

మరి నితిన్ తో అదే సబ్జెక్ట్ చేస్తున్నారో, లేక వేరే సబ్జెక్ట్ తీసుకున్నారో తెలియాల్సి వుంది. మాచర్ల నియోజ‌కవర్గం తరువాత నితిన్ కాస్త ఎక్కువ టైమ్ నే తీసుకుని వక్కంతం సినిమా స్టార్ట్ చేసారు. అది పూర్తి అయిన తరువాత ఈ సినిమాలు వుంటాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?