Advertisement

Advertisement


Home > Politics - National

92 ఏళ్ల వ‌య‌సులో మీడియా మొఘల్ ఐదో పెళ్లి!

92 ఏళ్ల వ‌య‌సులో మీడియా మొఘల్ ఐదో పెళ్లి!

ప్రపంచ మీడియా మొఘల్ న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్, బిలియ‌నీర్ రూప‌ర్డ్ మ‌ర్దోక్(92) ఐదో పెళ్లి చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 66 ఏళ్ల త‌న ప్రియురాలు ఆన్ లెస్లీ స్మిత్ తో ఇటీవ‌ల ఎంగేజ్ మెంట్ జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించారు. ఇప్పటికే నాలుగు వివాహాలు చేసుకున్న ఆయన.. తాజాగా త‌న ప్రియురాలుతో పెళ్లికి సిద్ధమయ్యారు. 

రూపర్ట్​ నాలుగో భార్య జెర్రీ హాల్​ కు విడాకులిచ్చిన ఆయ‌న‌.. ఏడు నెల‌ల‌కే మ‌రో పెళ్లికి సిద్ధ‌మయ్యారు. 'నేను చాలా సంతోషంగా ఉన్నాను గత సంవత్సరం ఓ సమావేశంలో లెస్లీను కలుసుకున్నాను కొంచెం సేపు ఆమెతో మాట్లాడాను ఆ తర్వాత రెండు వారాలకు ఆమెకు ఫోన్ చేశాను ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఇదే నాకు చివరి వివాహం అంటూ' సంతోషం వ్య‌క్తం చేశారు.

కాగా న‌లుగురికి విడాకులిచ్చిన రూప‌ర్డ్ కు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూమారైలు ఉన్నారు. త‌న రెండో భార్య నుండి విడాకులిచ్చినప్పుడు రూప‌ర్డ్ చెల్లించిన భ‌రణం ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైనది. అప్ప‌ట్లో దాదాపు ఆమెకు 17 బిలియ‌న్ డాలర్ల ఆస్తిని భ‌ర‌ణంగా చెల్లించిన‌ట్లు స‌మాచారం. ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు ఉన్న రూప‌ర్డ్ మర్దోక్ ఆస్తుల నికర విలువ 177 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్‌ ఇటీవల వెల్ల‌డించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?