షారూక్ తో మరో సౌత్ డైరెక్టర్!

ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ –బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ కాంబోలో ఒక సినిమా రాబోతోందని ప్రచారం ఉంది. వరస ఫ్లాపుల్లో ఉన్న షారూక్ కు అర్జెంట్ హిట్ ఇచ్చే అవకాశం అట్లీకి దక్కనుందనే…

ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ –బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ కాంబోలో ఒక సినిమా రాబోతోందని ప్రచారం ఉంది. వరస ఫ్లాపుల్లో ఉన్న షారూక్ కు అర్జెంట్ హిట్ ఇచ్చే అవకాశం అట్లీకి దక్కనుందనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే అట్లీ ఇటీవలి సినిమా కూడా రొటీన్ గా..సో..సో.. అనిపించింది. ఈ నేఫథ్యంలో అతడికి షారూక్ ఏ మేరకు ఛాన్స్ ఇస్తాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

అట్టీ-షారూక్ ల నడుమ చర్చలు చాన్నాళ్లుగానే సాగుతున్నాయని తెలుస్తోంది. అయితే సినిమా మాత్రం ప్రకటన రావడం లేదు. ఇక షారూక్ బర్త్ డే వేడుకల్లో మరో సౌతిండియన్ డైరెక్టర్ మెరిశాడు. అతడే వెట్రీమారన్.
ఇటీవలే తమిళ సినిమా 'అసురన్' ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ దర్శకుడు. ఈ నేపథ్యంలో షారూక్ పుట్టిన రోజు వేడుకల్లో ఇతడు కనిపించడం ఆసక్తిదాయకంగా మారింది. 

వెట్రిమారన్ డైరెక్షన్లో  షారూక్ హీరోగా సినిమా రాబోతోందనే ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉందిప్పుడు. అయితే ఇది కేవలం కర్టసీ మీటింగ్  మాత్రమే అంటూ వెట్రిమారన్ చెబుతున్నాడట. మొత్తానికి షారూక్ ఇప్పుడు సౌత్, అందునా తమిళ దర్శకులను నమ్ముకుంటున్నట్టుగా కనిపిస్తున్నాడు!