‘రాజధాని లేని ఏపీ’.. కేంద్రంపై ఏడుపెందుకు?

కేంద్ర హోంశాఖ.. తాజాగా భారతదేశపు మ్యాప్ ను విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్, లడాఖ్ లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కొత్తగా గుర్తించిన నేపథ్యంలో.. ఈ మ్యాప్ ను విడుదల చేశారని అనుకోవచ్చు. Advertisement అయితే…

కేంద్ర హోంశాఖ.. తాజాగా భారతదేశపు మ్యాప్ ను విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్, లడాఖ్ లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కొత్తగా గుర్తించిన నేపథ్యంలో.. ఈ మ్యాప్ ను విడుదల చేశారని అనుకోవచ్చు.

అయితే ఈ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్త సరిహద్దులతోనే చూపించారు గానీ.. ఆ రాష్ట్రానికి రాజధానిని మాత్రం సూచించలేదు. దీనిపై రకరకాల రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, దీన్ని వివాదంగా మార్చడానికి కూడా ప్రయత్నం జరుగుతోంది.

నిజానికి కేంద్ర హోంశాఖ సూచించిన మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకపోవడం అనేది.. ఎవరి తప్పిదం అవుతుంది. 2014లో ఏర్పడిన రాష్ట్రానికి పదేళ్లపాటూ హైదరాబాదు నగరమే రాజధానిగా ఉంటుందని.. ‘అధికారికంగా’ తెలియజెప్పే ప్రకటన… విభజన చట్టం రూపంలో ఉంది.

అదే సమయంలో ఆ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని అధికారికంగా ప్రకటిస్తున్న డాక్యుమెంట్ గానీ, నోటిఫికేషన్ గానీ ఏదీ రాలేదు. చంద్రబాబునాయుడు అమరావతి ముసుగులో ఒక రియల్ ఎస్టేట్ దందాను నడిపించడంపై చూపించిన శ్రద్ధ… ఆ ప్రక్రియకు అధికారిక రూపాన్ని ఇవ్వడంలో చూపించలేదు.

దాంతో సహజంగానే.. ఏపీ రాజధాని ఏది అంటే.. చంద్రబాబు ప్రచారం పుణ్యమాని చాలా మంది అమరావతి అనుకోవాల్సిందే తప్ప.. జరిగిందంటూ ఏమీ లేదు. కేవలం చంద్రబాబునాయుడు చేతగానితనం వల్లనే.. ఇవాళ రాజధాని నగరం అంటూ ఏదీ కనపడని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో… భారతదేశపు మ్యాప్ విడుదల అయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖర్మ అనుకుంటున్నరు.

రాజధాని నగరం విషయంలో జగన్ ప్రభుత్వం ఆ జాగ్రత్త తీసుకోవాలి. కమిటీ నివేదికల తర్వాత.. ఆ నగరం అమరావతి కావొచ్చు.. లేదా, ఇతర నగరాలు కావొచ్చు. కానీ, ఆ విషయంలో అధికారిక ప్రకటనతో.. గెజిట్ నోటిఫికేషన్ తో.. అదే రాజధాని అనే భావన ప్రజల్లోకి తేవాలి.