రోజులు మారిపోతున్నాయి. అడ్జస్ట్ మెంట్ అన్నది కనిపించడం లేదు. దాంతో ఎంత ప్రేమలు వున్నా, ఎంత పెద్దలు ఫిక్స్ చేసినా విడాకులు అన్న సమస్య తప్పడం లేదు.
సెలబ్రిటీల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా వుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్న తారతమ్యం ఏమీ లేదు.
లేటెస్ట్ గా టాలీవుడ్ లో మరో యువజంట విడాకుల దిశగా పయనిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ జంట వివాహం చేసుకుని మరీ ఏళ్లూ పూళ్లూ అయిపోలేదు. కానీ విడాకుల వరకు వెళ్లకుండా ఇరు వైపుల వర్గాలు సర్దిచెబుతున్నాయని అంటున్నారు.
ప్రస్తుతానికి మరీ ఎక్కువగా వినిపించడం లేదు. సర్దుబాటు కుదరకపోతే మాత్రం పక్కాగా బయటకు వస్తుందీ వార్త. ఏమైనా కుర్రకారు సెలబ్రిటీలు మరీ సెన్సిటివ్ గా మారిపోతున్నారు. ఇట్టే మనసులు మార్చేసుకుంటున్నారు.