Advertisement

Advertisement


Home > Movies - Movie News

విడిపోయిన పెద్దింటి జంట?

విడిపోయిన పెద్దింటి జంట?

టాలీవుడ్ లోనే కాదు, ఆధునిక సమాజంలోనే వైవాహిక జీవితాలు అంత సజావుగా సాగడం లేదు. మామూలు జనాల విడాకుల వ్యవహారాలు వాళ్ల వాళ్ల ఇంటికే పరిమితం. 

కానీ సెలబ్రిటీల వ్యవహారాలు న్యూస్ లుగా, గ్యాసిప్ లుగా మారతాయి. ఆ మధ్య సమంత-చైతూ ల వ్యవహారం వార్తలుగా, విడియోలుగా మారడం, ఆపై కోర్టు వరకు వెళ్లడం తెలిసిందే.

టాలీవుడ్ లోని మరో పెద్దంటి జంట కూడా విడాకుల దిశగా పయనిస్తోందని తెలుస్తోంది. ఈ పెద్దింటి జంట లో అమ్మాయి గతంలో ఓ విధంగా వార్తల్లోకి వచ్చారు. కానీ తరువాత వ్యవహారం సద్దు మణిగింది. అబ్బాయి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్నారు. 

వీరిద్దరి మధ్య ఈ  మధ్యనే సయోధ్య కొరవడిందని, అందువల్ల వేరువేరుగా వుండడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు. అడ్జస్ట్ మెంట్ అన్నది లేకనే కాపురాలు ఇలా అవుతున్నాయా? బ్యాచులర్ డైరక్టర్ భాస్కర్ ను అడగాలేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?