సినిమా పరిశ్రమలో హాస్య నటిగా కొనసాగడం అంత తేలికైన విషయం కాదు. మేల్ కమేడియన్లు బోలెడంత మంది ఉంటారు కానీ, ఫిమేల్ కమేడియన్లు తక్కువమందే. అలాంటి లోటును భర్తీ చేస్తున్న యువతి విద్యుల్లేఖా రామన్. తమిళ ప్రముఖ నటుడు మోహన్ రామన్ కూతురు విదుల్లేఖ. తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంది.
ప్రత్యేకించి తెలుగునాట కూడా విద్యుల్లేఖ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తన పెళ్లి కబురును చెప్పింది ఈ నటీమణి. కరోనా పరిణామాల్లో సినిమా షూటింగులు చాలా వరకూ ఆగిపోగా, ఇదే అదునుగా పలువురు సినిమా వాళ్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ జాబితాలో విద్యుల్లేఖ కూడా నిలుస్తోంది.
న్యూట్రీషియనిస్ట్ అయిన సంజయ్ ను ఈమె పెళ్లి చేసుకుంటోందట. అందుకు సంబంధించి ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది ఈ నటీమణి.