అతడంటే ఆమెకిష్టం, ఆమె అంటే అతడికి కూడా ఇష్టం. గట్టిగా అడిగితే ఫ్రెండ్స్ అని మాత్రమే చెబుతారు. ఇద్దరూ ఎప్పటికప్పుడు కలుసుకుంటారు. కలిసి విహార యాత్రలు కూడా చేశారు. కానీ వాళ్లు ఎప్పుడూ చెప్పలేదు. మీడియాకు మాత్రం దొరికిపోయేవారు.
సోషల్ మీడియాలో పెట్టే ఫొటోల్లో వాళ్లు ఒకే చోట ఉన్నారనే విషయం బయటపడేది. ఓసారి ఓ రిసార్ట్ లో, ఇంకోసారి హీరో ఇంట్లో. మరో సందర్భంలో రెస్టారెంట్ లో. ఇలా కలిసి ఉన్నప్పటికీ వేర్వేరుగా ఫొటోలు పెట్టేవారు. కానీ ఒకే చోట ఉన్న విషయం మీడియాకు తెలిసిపోయేది.
ఈసారి హీరో అమెరికా వెళ్లాడు. తన కుటుంబంతో సహా అక్కడ ల్యాండ్ అయ్యాడు. ఈ హీరోయిన్ యూరోప్ లో ల్యాండ్ అయింది. ప్రస్తుతం అక్కడే ఉన్నానంటూ ఫొటోలు పెడుతోంది. కానీ జనాలకు మాత్రం చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే, గతానుభవాలు అలాంటివి మరి.
వాళ్లిద్దరు ఎవరనేది ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. వాళ్లే విజయ్ దేవరకొండ, రష్మిక. విజయ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ తో కలిసి విహరిస్తున్నాడు. రష్మిక ఇటలీలో ఉన్నట్టు చెబుతోంది. కానీ జనాలు మాత్రం వీళ్లిద్దరూ ఏదో ఒక ప్లేస్ లో కచ్చితంగా కలిసే ఉంటారని అనుమానిస్తున్నారు. మరికొందరైతే అసలు వాళ్లంతా ఒకేచోట ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.