రష్మికపై విజయ్ దేవరకొండ కవిత

రష్మిక లీడ్ రోల్ పోషిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి ఈరోజు టీజర్ రిలీజైంది. టీజర్ మొత్తం రష్మిక కనిపించింది. వెనక విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది.

రష్మిక లీడ్ రోల్ పోషిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి ఈరోజు టీజర్ రిలీజైంది. టీజర్ మొత్తం రష్మిక కనిపించింది. వెనక విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది.

సాధారణంగా హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. కానీ విజయ్ దేవరకొండతో ఈ సినిమా కోసం ఏకంగా కవిత చెప్పించారు. టీజర్ లో ఇదే హైలెట్.

ఎందుకంటే, నిజజీవితంలో రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారనే సంగతి తెలిసిందే. అలా తన ప్రేయసి సినిమా కోసం, ప్రేయసిపై దేవరకొండ ఓ కవిత చెప్పడం బాగుంది.

“నయనం నయనం కలిసే తరుణం.. యదనం పరుగే పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం..” అంటూ రాసిన కవిత బాగుంది. టీజర్ లో రష్మికను కాలేజ్ స్టూడెంట్ గా చూపించారు. అంతకుమించి సినిమా కథ పై క్లూస్ ఏం ఇవ్వలేదు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. కీలక పాత్రల్లో రావు రమేష్, రోహిణి కనిపించనున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం బాగుంది.

పుష్ప-2 సక్సెస్ తర్వాత రావడం, స్వయంగా సుకుమార్ ఈ సినిమా టీజర్ ను మెచ్చుకోవడంతో ది గర్ల్ ఫ్రెండ్ పై అంచనాలు పెరిగాయి. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకు ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు.

2 Replies to “రష్మికపై విజయ్ దేవరకొండ కవిత”

  1. బ్రతికే ఎందుకున్నావు..

    చావా లేదు కనుక..

    ఎందుకు చావాలేదు..

    బ్రతికు ఉన్నావు కనుక..

Comments are closed.