ప్రేమలు లక్ష రకాలు. అదో సాగరమంత సబ్జెక్ట్. తోడుకున్నవారికి తోడుకున్నంత. సినిమా పుట్టిన దగ్గర నుంచి ప్రేమకథాచిత్రాలు పుట్టడం మొదలైంది. ఇప్పటికి ఓ సవాలక్ష క్యారెక్టర్లు, కథలు పుట్టి వుంటాయి. ఇప్పుడు మరోటి వచ్చింది అలాగే… డ్రింకర్ సాయి..అనే సినిమా. పిచ్చి ప్రేమ లేదా భరించలేని ప్రేమ నిండపోయిన కుర్రాడి క్యారెక్టర్ తో. ఈ సినిమా ట్రయిలర్ వచ్చింది.
విపరీతమైన ప్రేమ.. భరించలేక భరించిన వైనం.. చివరకు వదిలించేసుకోవాలనుకునే ప్రయత్నం. దాంతో పుట్టిన సంఘర్షణ.. ఇవన్నీ రెండు నిమిషాల ఆరున్నర సెకెండ్ల ట్రయిలర్ లో పరుచుకున్నాయి. కాస్త చిన్న ట్రయిలరే అని చెప్పాలి. కథను కాన్సెప్ట్ ను సీన్ల వారీగా పేర్చుకుంటూ ఓ బిజినెస్ కట్ మాదిరిగా తయారు చేసారు.
ట్రయిలర్ కాన్సెప్ట్ లో కొత్తదనం కన్నా, క్యారెక్టరైజేషన్, లీడ్ పెయిర్ ఇద్దరూ ఎలా చేసారు అన్నది ఇంట్రస్టింగ్ గా వుంది. లీడ్ పెయిర్ ధర్మ, ఐశ్వర్య శర్మ ఇద్దరూ బాగానే చేసినట్లు కనిపిస్తోంది. ప్రేమ వల్ల ఆనందం పుట్టడం కన్నా, సంఘర్షణ, ఆవేదన అనివార్యమైతే అది నాయిక నాయకులు ఇద్దరినీ బాధపెడుతుంది. ట్రయిలర్ లో అదే కనిపించింది.
అయితే హీరో పాత్ర మరీ వైపరెత్య ధోరణిలో ప్రవర్తిస్తున్నట్లు చిత్రీకరించారు. దానికి తగినట్లే కాస్త రా..బూతు ధ్వనించే డైలాగులు ట్రయిలర్ లో పడ్డాయి. ఈ సినిమాకు కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు.
ఏం పరవాలేదు.. ఇప్పటికే అందరూ తాగుబోతులే కనక.. కొత్తగా ఈ సినిమా చూసి ఎవరు బ్రష్టు పట్టరు …
Call boy ga join avvu 7997531zeeo zero4
Male escort works 7997531zero zero 4