జానీ మాస్టర్ ను నిజంగా తీసేశారా?

అసోసియేషన్ లో సభ్యత్వంపై సుదీర్ఘంగా మాట్లాడిన జానీ మాస్టర్.. అదే ఊపులో జనసేన సభ్యత్వంపై కూడా స్పందిస్తే బాగుండేది.

తాజాగా డాన్స్ డైరక్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే అది కాదు న్యూస్. జానీ మాస్టర్ పదవీకాలం ఇంకా ఉంది. అయినప్పటికీ ఎన్నికలు జరిపి మరో అధ్యక్షుడ్ని ఎన్నుకున్నారు. మరోవైపు ప్రకాష్ ఇలా గెలిచిన వెంటనే, అలా జానీ మాస్టర్ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేశాడనే పుకార్లు అందుకున్నాయి.

తాజాగా ఈ పుకార్లు, గందరగోళంపై జానీ మాస్టర్ స్పందించాడు. తన పదవీకాలం ఇంకా ఉన్నప్పటికీ, అనధికారికంగా, అనైతికంగా ఎన్నికలు నిర్వహించి, వాళ్లే నిర్ణయాలు తీసుకొని, హోదాలు పంచుకున్నారని ఆరోపించాడు.

అయితే అసోసియేషన్ లో తన సభ్యత్వాన్ని శాశ్వతంగా తొలిగించలేదని జానీ మాస్టర్ స్పష్టం చేశాడు. సభ్యత్వాన్ని తొలిగించే హక్కు, టాలెంట్ ను ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదన్నాడు. తన సభ్యత్వం పోలేదని స్పష్టం చేస్తూనే, తాజాగా జరిగిన ఎన్నికలపై లీగల్ గా ఫైట్ చేస్తానని ప్రకటించాడు జానీ మాస్టర్.

తన సభ్యత్వం పోయినట్టు మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు జానీ మాస్టర్. శాశ్వత సభ్యత్వాన్ని ఎవ్వరూ రద్దు చేయలేరని, ఎప్పట్లానే తను సినిమాల్లో వర్క్ చేస్తానని అంటున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి త్వరలోనే తను కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ఒకటి రిలీజ్ అవుతుందని అన్నాడు.

అసోసియేషన్ లో సభ్యత్వంపై సుదీర్ఘంగా మాట్లాడిన జానీ మాస్టర్.. అదే ఊపులో జనసేన సభ్యత్వంపై కూడా స్పందిస్తే బాగుండేది. తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ను మైనర్ గా ఉన్నప్పుడే లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన జానీ మాస్టర్, ఈమధ్యే బెయిల్ పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

5 Replies to “జానీ మాస్టర్ ను నిజంగా తీసేశారా?”

  1. మంచి చెడు తో సంబంధం లేదు.. ఎంత పబ్లిసిటీ వస్తే అంత పని దొరుకుతుంది…

  2. There is so much negativity on this guy why?

    first of all he came to limelight politics by criticizing ycp leaders but he looks like he is in trap by either janasena or tdp…

    his chapter of use and throw by them is over.

    probably he won’t be good in Telugu field also..’

Comments are closed.