అమ్మకే చెప్పలేదు, మీకు ఎందుకు చెప్పాలి?

తమన్న బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి చాలామందికి తెలియదు. అంతకుముందు చాలా సినిమాలు చేసినప్పటికీ, తమన్న లవర్ అని తెలిసిన తర్వాత మాత్రమే టాలీవుడ్ జనాల ఫోకస్ అతడిపై పడింది. మరీ ముఖ్యంగా…

తమన్న బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి చాలామందికి తెలియదు. అంతకుముందు చాలా సినిమాలు చేసినప్పటికీ, తమన్న లవర్ అని తెలిసిన తర్వాత మాత్రమే టాలీవుడ్ జనాల ఫోకస్ అతడిపై పడింది. మరీ ముఖ్యంగా ఏదైనా అతడు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. ఇప్పుడు తన పెళ్లిపై కూడా అంతే ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు. 

తమన్న-విజయ్ ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే ఆ పెళ్లి ఎప్పుడనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇదే ప్రశ్న విజయ్ వర్మకు ఎదురైంది. తమన్నను ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని ప్రశ్నించింది బాలీవుడ్ మీడియా.

ఈ విషయంపై సూటిగా స్పందించాడు విజయ్ వర్మ. తమన్నాను తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని తన తల్లికే ఇంకా చెప్పలేదని, మీడియాకు ఎందుకు చెబుతానంటూ సమాధానమిచ్చారు. దీంతో ఒక్కసారిగా అంతా సైలెంట్ అయ్యారు.

పెళ్లిపై గతంలోనే తమన్న స్పందించింది. ప్రస్తుతం తామిద్దరం తమ కెరీర్ లో బిజీగా ఉన్నామని, పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచన లేదని తెలిపింది. అయితే వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు చెలరేగాయి. ఈ రూమర్స్ పై స్పందించిన విజయ్ వర్మ, మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు సమాధానం ఇచ్చారు.

అయితే వీళ్ల పెళ్లిపై బాలీవుడ్ లో పుకార్లు మాత్రం ఆగడం లేదు. పెళ్లికి సంబంధించి ఇద్దరూ ప్రిపరేషన్ లో ఉన్నారని, తెరవెనక ఏర్పాట్లు సాగుతున్నాయంటూ కథనాలు వస్తున్నాయి.