విక్రమ్ ఎంత మంది తీస్తారు

విక్రమ్ సినిమా వచ్చి, హిట్ అయి రోజులు గడిచిపోయాయి. కానీ టాలీవుడ్ జ‌నాలకు దాని హ్యాంగోవర్ మాత్రం పోవడం లేదు. మన దగ్గర సీనియర్ హీరోలు చాలా మంది వుండడంతో, విక్రమ్ లాంటి సినిమా…

విక్రమ్ సినిమా వచ్చి, హిట్ అయి రోజులు గడిచిపోయాయి. కానీ టాలీవుడ్ జ‌నాలకు దాని హ్యాంగోవర్ మాత్రం పోవడం లేదు. మన దగ్గర సీనియర్ హీరోలు చాలా మంది వుండడంతో, విక్రమ్ లాంటి సినిమా చేస్తే ఎలా వుంటుదనే ఐడియా దర్శకులను వెంటాడుతోంది. ఇప్పటికే ఇద్దరు దర్శకులు ఇలాంటి ఐడియాతో వున్నారని తెలుస్తోంది.

బాలయ్యతో అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కథేంటీ అన్న సంగతి అలా వుంచితే విక్రమ్ టైపులో వుంటుందని వినిపిస్తోంది. ఓల్డ్ మాన్ కాదు కానీ మిడిల్ ఏజ్డ్ యాంగ్రీ ఫైటర్ గా హీరో వుంటారన్నమాట. అచ్చం విక్రమ్ లో మాదిరిగా.

ఇదిలా వుంటే హిట్ 2 దర్శకుడు శైలేష్ కూడా ఓ సినిమాను విక్రమ్ స్టయిల్ లోనే చేయబొతున్నారని వినిపిస్తోంది. దీనికి హీరో వెంకటేష్. అంటే వెంకీ ఈ సినిమాలో యాంగ్రీ, యాక్షన్, మిడిల్ ఏజ్డ్ హీరోగా కనిపిస్తారేమో?

ఇద్దరు డైరక్టర్ల కథలు ఏం రాసుకున్నా, విక్రమ్ స్టయిల్ లో మేకింగ్ వుంటుందని వినిపిస్తోంది. మరి ఇంకెంత మంది డైరక్టర్లు, హీరోలు విక్రమ్ దారిలో వెళ్తారో చూడాలి.