బీఆర్ఎస్ కి జై…విశాఖ నుంచి ఖమ్మానికి సై

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తరువాత అతి పెద్ద సభను ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తోంది. ఆ సభను లక్షలాది మంది జనాల మధ్యన నిర్వహించాలనుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి అది పెద్ద…

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తరువాత అతి పెద్ద సభను ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తోంది. ఆ సభను లక్షలాది మంది జనాల మధ్యన నిర్వహించాలనుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి అది పెద్ద సమస్య కాదు.

కానీ బీఆర్ఎస్ పార్టీగా మారింది. జాతీయ పార్టీగా చూపించుకోవాలి కదా. అందుకే ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతోంది. ఖమ్మం పొరుగు జిల్లాల నుంచే కాకుండా విశాఖ వంటి సదూర ప్రాంతాల నుంచి కూడా బీఆర్ఎస్ సభలకు వెళ్తున్నారు.

వారిలో ఒకనాటి వీర సమైక్యతావాదులు ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఉమ్మడి ఏపీ విభజన కోసం పోరాటం సాగుతున్న రోజులల్లో విశాఖలో జేటీ రామారావు అనే ఒకాయన సమైక్యాంధ్రా అంటూ హడావుడి చేసేవారు. ఆయన అప్పట్లో కేసీయార్ ని బాగా విమర్శించేవారు.

ఇపుడు ఆయన జై కేసీయార్ అంటున్నారు. జై బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్ కి విశాఖ నుంచి దొరికిన నాయకుడు ఆయన. తన వెంట మరికొందరిని వెంట ట్టుకుని ఖమ్మం సభకు జేటీ రామారావు వెళ్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. బీఆర్ఎస్ సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు.

జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకమైన పాత్ర పోషిస్తుంది అని ఆయన అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా ఏపీ తెలంగాణాలకు బీజేపీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఉమ్మడి ఏపీని విడదీసిన కేసీయార్ ఇపుడు ఆప్తుడు అయ్యారు, కేంద్రంలోని బీజేపీ విలన్ అన్న మాట. ఏపీలో బీఆర్ఎస్ పాతుకుపోవడానికి ఈ పొలిటికల్ స్ట్రాటజీ సరిపోదా అని అంటున్నారు. రానున్న రోజుల్లో మరింతమంది జై బీఆర్ఎస్.. బీజేపీ అన్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు.