మళ్లీ యాక్షన్ లోకి విశాల్.. ట్రీట్ మెంట్ పూర్తి

ప్రస్తుతం లాఠీ అనే సినిమా చేస్తున్నాడు విశాల్. గత నెలలో ఈ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు ఈ హీరో. దీనికి సంబంధించి ప్రకృతి చికిత్స కోసం కేరళ వెళ్లిన ఈ హీరో,…

ప్రస్తుతం లాఠీ అనే సినిమా చేస్తున్నాడు విశాల్. గత నెలలో ఈ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు ఈ హీరో. దీనికి సంబంధించి ప్రకృతి చికిత్స కోసం కేరళ వెళ్లిన ఈ హీరో, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాడు.

గత నెల 11వ తేదీన తీవ్రంగా గాయపడ్డాడు విశాల్. లాఠీ సినిమాకు సంబంధించిన ఓ యాక్షన్ సన్నివేశంలో, బాలుడిని రక్షిస్తూ ఆయన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి పడ్డాడు. అప్పటికే మరో 2 గాయాలతో ఇబ్బంది పడుతున్న విశాల్ ను ఈ గాయం మరింత ఇబ్బంది పెట్టింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.

అప్పట్నుంచి 2 వారాల పాటు కేరళలోని ఓ ఆయుర్వేదిక కేంద్రంలో చికిత్స తీసుకున్న విశాల్, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. తిరిగి సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు.

నిజానికి విశాల్ కు గాయాలు కొత్త కాదు. దాదాపు తన ప్రతి సినిమా షూటింగ్ లో గాయాలబారిన పడుతుంటాడు ఈ హీరో. ఎనిమి, సామాన్యుడు సినిమాల టైమ్ లో గాయాల బారినపడినప్పటికీ, లాఠీ షూటింగ్ ను మొదలుపెట్టాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మరో గాయం తగలడంతో బ్రేక్ అనివార్యమైంది.