Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఒంటరిగా పోటీ.. నేనేంటో చూపిస్తా

ఒంటరిగా పోటీ.. నేనేంటో చూపిస్తా

రాజకీయాలపై ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు హీరో విశాల్. కాలం కలిసొస్తే తప్పకుండా తమిళ రాజకీయాల్లోకి అడుగుపెడతానని, 2 నెలల కిందట వెల్లడించాడు. ఇప్పుడా అంశానికి సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చాడు.

తమిళనాట 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించాడు విశాల్. కొత్త పార్టీ పెట్టాలా లేక ఏదైనా పార్టీలో చేరాలా అనే విషయంపై అప్పుడే ఆలోచిస్తానని తెలిపాడు. చెన్నైలోని వడపళనిలో మీడియాతో మాట్లాడిన విశాల్.. ప్రస్తుతానికైతే తనకు ఒంటరిగా పోటీ చేయాలని ఉందని, తన సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నట్టు వెల్లడించాడు.

2026 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో తన పేరు కచ్చితంగా ఉంటుందంటున్న విశాల్.. ప్రజలకు సరిపడ సౌకర్యాలు లేవని, ఆ సౌకర్యాల కల్పన కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు.

ఇప్పటికే విశాల్ కు ఓ స్వచ్చంధ సంస్థ ఉంది. దాని పేరు 'మక్కల్ నల ఇయక్కం'. దాని ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి తను ఛారిటీ చేయడం లేదని.. ప్రజలను మెరుగైన స్థితిలో నిలపడమే తన లక్ష్యమని ప్రకటించాడు.

విశాల్ కు ఇష్టమైన హీరో విజయ్ ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చాడు. 2026 ఎన్నికల్లో ప్రత్యేక ఎజెండాతో రంగంలోకి దూకబోతున్నాడు. విజయ్ తో కలిసి విశాల్ పనిచేసే అవకాశం ఉందంటూ ఇప్పటికే కథనాలు వచ్చాయి. తన రాజకీయ ప్రవేశంపై విశాల్ ప్రకటన చేయడంతో, ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?