విష్ణు ప్యానల్ లో రఘుబాబు

మా ఎన్నికల హడావుడి స్పీడ్ అందుకున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఏనాడో రెడీ అయిపోయింది. మంచు విష్ణు ప్యానల్ ఈ ఆదివారం ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.  Advertisement ఇదిలావుంటే ప్యానల్ లో కీలకమైన జనరల్ సెక్రటరీ…

మా ఎన్నికల హడావుడి స్పీడ్ అందుకున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఏనాడో రెడీ అయిపోయింది. మంచు విష్ణు ప్యానల్ ఈ ఆదివారం ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. 

ఇదిలావుంటే ప్యానల్ లో కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్ట్ కు యాక్టర్ రఘుబాబు పోటీ చేబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటకే బాబు మోహన్ కూడా ప్యానల్ లో వుండబోతున్నారని వార్తలు వచ్చాయి.

అంటే మూడు పోస్టులకు పేర్లు ఖరారు అయినట్లే. అధ్యక్ష పదవికి మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబు మోహన్, ప్రధాన కార్యదర్శి పదవికి రఘుబాబు ఫిక్స్ అయ్యారు. ఇక మిగిలిన పదవులకు పేర్లను సోమవారం ప్రకటిస్తారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రధాన కార్యదర్శి పదవికి నటి జీవిత పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా వుంటే అదే ప్రధాన కార్యదర్శి పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆయన పోటీ కనుక ఫిక్స్ అయితే ప్రధాన కార్యదర్శి పదవికి ముక్కోణపు పోటీ వున్నట్లే.