Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డైరక్టర్ల చార్టర్ ఫ్లయిట్ విహారయాత్ర

డైరక్టర్ల చార్టర్ ఫ్లయిట్ విహారయాత్ర

డైరక్టర్లు అంటే అందరకీ కాకపోయినా చాలా మందికి డబ్బుల కొరత ఏమీ వుండదు. అందులోనూ ఆయన సీనియర్ దర్శకుడు. నిర్మాణ వ్యవహారాలు కూడా వున్నాయి. 

ఇక డబ్బులకు కొదవేముంది. అందుకే ఓ చార్టర్ ఫ్లయిట్ వేసుకుని మరీ గుళ్లు, గోపురాలు తిరిగి వచ్చారని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

సరే, అయితే అందులో వింత, విడ్డూరం, వార్త ఏముంది? అని టక్కున అనేయచ్చు. కానీ అక్కడే చిన్న ట్విస్ట్ వుంది. ఆయన ఒంటరిగా వెళ్లలేదు. మరో మహిళా దర్శకురాలని తోడు తీసుకెళ్లారని టాక్ వినిపిస్తోంది. 

నిజానికి ఆ మహిళా దర్శకురాలు ఆయన శిష్యురాలూ కాదు, ఆయన సినిమాలతో సంబంధమూ లేదని తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?