రామ్ గోపాల్ వర్మ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చాడా..!

ఊరందరిదీ ఒక దారి, ఆర్జీవీది మరో దారి. కేవలం వ్యవహార శైలిలోనే కాదు, సినిమాల విషయంలో కూడా వర్మ వెరైటీ. అలాంటి వర్మ ఇప్పుడు మరోసారి మెయిన్ స్ట్రీమ్ మూవీ మేకింగ్ లోకి వచ్చినట్టు…

ఊరందరిదీ ఒక దారి, ఆర్జీవీది మరో దారి. కేవలం వ్యవహార శైలిలోనే కాదు, సినిమాల విషయంలో కూడా వర్మ వెరైటీ. అలాంటి వర్మ ఇప్పుడు మరోసారి మెయిన్ స్ట్రీమ్ మూవీ మేకింగ్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఉన్నట్టుంది సడెన్ గా ఉపేంద్ర హీరోగా కొత్త సినిమా ప్రకటించాడు ఆర్జీవీ.

ఇన్నాళ్లూ ఊరుపేరు లేని సినిమాలు తీశాడు వర్మ. కొన్ని సినిమాల్ని శృంగారభరితంగా తీస్తే, మరికొన్ని సినిమాల్ని వివాదాస్పదంగా తీశాడు. మరీ ముఖ్యంగా రీసెంట్ గా వర్మ తీసిన సినిమాల్లో స్టార్ కాస్ట్ అనేది లేకుండా పోయింది. 

పేరులేని నటీనటులే కనిపించారు. తాజాగా ఉపేంద్రతో సినిమా ప్రకటించడంతో.. వర్మ మళ్లీ ఇన్నేళ్లకు మెయిన్ స్ట్రీమ్ మూవీ మేకింగ్ లోకి వచ్చాడంటున్నారు చాలామంది. అయితే మరికొందరు మాత్రం ఈ ప్రాజెక్టుపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఎందుకంటే, ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రకటించాడు వర్మ. అందులో 90శాతం సినిమాలు పట్టాలపైకి రాలేదు. ఒక సినిమా ప్రకటించి, మరో సినిమా చేయడం వర్మకు అలవాటే. ఆ అలవాటు ప్రకారం, ఉపేంద్ర సినిమాను కూడా ఇలా ప్రకటించి, అలా గాలికొదిలేస్తాడని అంటున్నారు చాలామంది.

హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఉపేంద్రతో వర్మ సినిమా తీయాలని కోరుకుంటున్నారు. అప్పటి సత్య, సర్కార్ రోజుల్ని మరోసారి గుర్తుచేయాలని అంటున్నారు. ఉపేంద్రతో సినిమా తీస్తే మాత్రం వర్మ, మెయిన్ స్ట్రీమ్ మూవీ మేకింగ్ లోకి వచ్చినట్టే.