దాదాపుగా అన్నీ ప్రేమకథలే చేశాడు విశ్వక్ సేన్. అందులో కూడా అతడి సినిమాల్లో బ్రేకప్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. బ్రేకప్ స్టోరీలు ఈ హీరోకు ఇష్టమా? లేక అనుకోకుండా అలా బ్రేకప్స్ పడుతున్నాయా? అతడి లైఫ్ లో ఏమైనా బ్రేకప్ లవ్ స్టోరీ ఉందా? ఇవే ప్రశ్నలు విశ్వక్ కు ఎదురయ్యాయి.
దీంతో తన లైఫ్ లో ఎదురైన బ్రేకప్ ను బయటపెట్టాడు ఈ హీరో. తను ఒకేసారి లవ్ లో పడ్డానని, అది కూడా బ్రేకప్ అయిందని తన భగ్న ప్రేమకథను వెల్లడించాడు.
“ప్రతి మగాడి లైఫ్ లో బ్రేకప్ ఉంటుంది. దాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు. నా లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ ఉంది. అంతకుమించి ఎక్కువ బ్రేకప్స్ నాకు జరగలేదు. ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాను. కాలేజీలో మూడేళ్లు చూశాను. కాలేజ్ లో ఉన్నప్పుడు మాట్లాడలేదు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఓ ఫ్రెండ్ పార్టీలో కలిశాం. ఓ ఘటన వల్ల ఇద్దరం దగ్గరయ్యాం. అంతా ఓకే అనుకున్నాను. కానీ మా జర్నీలో ఆ అమ్మాయి నాకు ఎప్పుడో బ్రేకప్ చెప్పేసింది. ఆ విషయం 30 రోజుల తర్వాత నాకు తెలిసింది. తను మొదటి రోజు లేదా 7వ రోజు చెబితే బాగుండేది. కానీ నాకు నెల రోజుల తర్వాత తెలిసింది. అది చాలా బాధాకరం.”
ఆ బ్రేకప్ తర్వాత చాలా ఎమోషనల్ అయ్యానని, అందుకే తన సినిమాల్లో ఎక్కువగా బ్రేకప్ సీన్స్ ఉంటాయని తెలిపాడు విశ్వక్ సేన్. బ్రేకప్ అయినప్పుడు ఏడుపు పాటలు కాకుండా, కాస్త జోష్ ఉన్న సాంగ్స్ పెట్టమని తనే దర్శకులకు చెబుతుంటానని అన్నాడు. అందుకే తన సినిమాల్లో బ్రేకప్ పాటలు కూడా ఫుల్ జోష్ గా ఉంటాయన్నాడు.
ఈ హీరో నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా విడుదలకు సిద్ధమైంది. వయసైపోతున్నా ఇంకా పెళ్లి కాని అబ్బాయి పాత్రలో విశ్వక్ ఇందులో నటించాడు.