లీగల్ యాక్షన్ కు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ తాజా చిత్రం గామి. ప్రస్తుతం థియేటర్లలో ఉంది ఈ సినిమా. రీసెంట్ గా మొదటి వారాంతం పూర్తి చేసుకుంది. విడుదలైన 3 రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు.…

విశ్వక్ సేన్ తాజా చిత్రం గామి. ప్రస్తుతం థియేటర్లలో ఉంది ఈ సినిమా. రీసెంట్ గా మొదటి వారాంతం పూర్తి చేసుకుంది. విడుదలైన 3 రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోందని అంటున్నారు. 

అయితే ఓవైపు సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నప్పటికీ, మరోవైపు తమ సినిమాపై తప్పుడు ప్రచారం నడుస్తోందని, రేటింగ్స్ దారుణంగా ఇస్తున్నారంటూ యూనిట్ ఇప్పటికే తమ బాధను వ్యక్తం చేసింది. ఇప్పుడీ వ్యవహారంపై హీరో విశ్వక్ సేన్ స్పందించాడు. ఏకంగా లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెబుతున్నాడు.

“గామి సినిమా సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా దృష్టికి వచ్చిన ఓ సమస్యను మీ ముందు ఉంచుతున్నాను. మా సినిమా ప్రతిష్టను దెబ్బతీసేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు. బుక్ మై షో లాంటి వేదికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అనైతిక బాట్స్ ద్వారా మా సినిమాకు 10కి 1 రేటింగ్ ఇస్తున్నారు. మా సినిమాకు 10కి 9 రేటింగ్ జెన్యూన్ గా వచ్చింది. ఇప్పుడది 1కి పడిపోయింది.”

ఇలా తమ సినిమాను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించాడు విస్వక్ సేన్. ఈ పని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారనే విషయం తనకు తెలియదని, తను మాత్రం దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన ప్రకటించాడు.

ప్రయోగాత్మకంగా గామి సినిమా తెరకెక్కిందని, క్వాలిటీ సినిమాను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపిన విశ్వక్ సేన్.. తనను ఎన్నిసార్లు కిందకు లాగాలని ప్రయత్నించినా, పైకి లేస్తానని ప్రకటించుకున్నాడు. గామి సినిమాలో అఘోరాగా కనిపించాడు ఈ నటుడు