నైజాంలో ఏకైక బయ్యర్ దిల్ రాజు. ఆయన కాకుండా ఆసియన్ సునీల్, సురేష్ బాబు వున్నా సినిమాలు కొనడానికి ఆసక్తి చూపించరు. అడ్వాన్స్ ల మీద పంపిణీ చేయడానికి తప్ప. దిల్ రాజు మాత్రమే ధైర్యం చేసి ఎన్ఆర్ఎ పద్దతిన కొంటుంటారు.
అప్పుడప్పుడు ఆయనకు పోటీగా వరంగల్ శ్రీను రంగంలోకి దిగుతుంటారు. ఈ మధ్యనే ఆచార్య సినిమాను నైజాం ఏరియాకు 36 కోట్లకు తీసుకున్నారు వరంగల్ శ్రీను. అందుకే ఏ మేరకు దెబ్బతింటారు అన్నది పక్కన పెడితే మళ్లీ మరోసారి అలాంటి డేరింగ్ స్టెప్ వేసారు.
పూరి జగన్నాధ్ ‘లైగర్’ సినిమాను ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియాలకు 70 కోట్లకు కొన్నారని చెబుతున్నారు. కాదు 60 కోట్లకు మాత్రమే అని మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. మొత్తం మీద అరవై అయినా, డెభై అయినా కాస్త డేరింగ్ స్టెప్ నే.
ఎందుకంటే సినిమా హిట్ టాక్ వస్తే ఈ అమౌంట్ పెద్ద సమస్య కాదు. కానీ తేడా టాక్ వస్తే మాత్రం చాలా పెద్ద రిస్క్ అవుతుంది.
కేవలం నైజాం వుంచుకుని, ఆంధ్ర, సీడెడ్ మళ్లీ అమ్మేసే ఆలోచనతోనే వరంగల్ శ్రీను తీసుకున్నారు. అందువల్ల వర్కవుట్ అవుతుందనే ధైర్యంగా వున్నారు.
ఇదిలా వుంటే అదే లైగర్ సినిమా ఓవర్ సీస్, మిగిలిన ఏరియాలు కూడా వరంగల్ శ్రీనునే బేరాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆచార్యతో గట్టి దెబ్బతిన్నా కూడా ఏమిటి అతగాడి ధైర్యం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో.