వీకెండ్ రిలీజ్.. ప్రతి సినిమాకూ ఓ ప్రత్యేకత

సంక్రాంతి సినిమాల హవా తగ్గడంతో, ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా ఫిబ్రవరి నెలకు బోణీ కొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే… ఈ…

సంక్రాంతి సినిమాల హవా తగ్గడంతో, ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా ఫిబ్రవరి నెలకు బోణీ కొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే… ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది.

సుహాస్ హీరోగా నటించిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. కంటెంట్ పై నమ్మకంతో రేపట్నుంచే పెయిడ్ ప్రివ్యూస్ వేస్తున్నారు. అలా ప్రివ్యూలు వేసి శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు కుటుంబాలతో కలిసి చూసేందుకు వీలుగా భారీగా టికెట్ రేట్లు తగ్గించారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది ఈ సినిమా చూశారు, క్లయిమాక్స్ బాగుందంటూ ఫీలర్లు వదిలారు. అదే ఈ సినిమాకు పెద్ద ప్రచారం.

ఇక ఈ వీకెండ్ అంచనాలతో వస్తున్న మూవీ మైఖేల్. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ లాంటి స్టార్ కాస్ట్ తో వస్తోంది. ట్రయిలర్ ఆల్రెడీ పెద్ద హిట్టయింది.

ఇక మాయగాడు, సువర్ణసుందరి అనే మరో 2 సినిమాలు కూడా ఈ శుక్రవారమే వస్తున్నాయి. వీటిలో మాయగాడుకు ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు నాలుగేళ్ల కిందట నవీన్ చంద్ర చేసిన సినిమా ఇది. అప్పుడు దాని పేరు 'హీరో-హీరోయిన్'. ఇప్పుడు దానికి కొత్తగా మాయగాడు అంటూ టైటిల్ మార్చారు. పైరసీపై వస్తున్న సినిమా ఇది. ఇక సువర్ణ సుందరి సినిమా కూడా ఇలాంటిదే. ఇది కూడా నాలుగేళ్ల కిందటి సినిమానే. కాకపోతే టైటిల్ మార్చకుండా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు ప్రేమదేశం, తుపాకుల గూడెం సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు 2 డిఫరెంట్ కాన్సెప్టులతో తెరకెక్కాయి. ఇక ఈ సినిమాలు రిలీజైన మరుసటి రోజు, అంటే 4వ తేదీన వస్తోంది బుట్టబొమ్మ సినిమా. మలయాళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ ఇది. బాలనటి అనికా సురేంద్రన్ ఈ సినిమాతో హీరోయిన్ గా మారింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి పెద్ద సంస్థ నుంచి వస్తోంది ఈ మూవీ.

ఇలా ఈ వారాంతం 7 సినిమాలు రిలీజ్ కు రెడీ అవ్వగా, ప్రతి సినిమాకూ ఓ ప్రత్యేకత ఉండడం విశేషం.