జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విమర్శల దాడికి దిగారు. చదివేందుకు సంస్కార భాషలో ఉన్నప్పటికీ, వాటి ఘాటు తట్టుకోలేనంతగా వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ మంత్రి ఎవరో తెలియదంటూ పవన్ కల్యాణ్ ఆ మధ్య బహిరంగ సభలో వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో పవన్‌పై మరింతగా మంత్రి అమర్నాథ్ రెచ్చిపోతున్నారు.
తాజాగా పవన్‌పై వేర్వేరు ట్వీట్లు చేశారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ఇవాళ ఉదయం జగన్‌పై ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. క్లాస్, క్లాసిక్ అంటూ పవన్ తనకు తోచిన రీతిలో హితబోధ చేసి తుత్తి పొందారు. దీంత పవన్ వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేస్తూ గుడివాడ అమర్నాథ్ జనసేనానితో పాటు ఆ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టారు. ఆ ట్వీట్ల సంగతేంటో చూద్దాం.
“ఆక్సీ మోరాన్‌కు మరికొన్ని ఎగ్జాంపుల్స్– బీజేపీతో వివాహం… చంద్రబాబుతో సంసారం… హిందీ అమ్మాయితో పెళ్ళి… రష్యన్‌తో పిల్లలు… అన్న పరువు బజారు పాలు, తండ్రి పరువు బుగ్గి పాలు!”
“బాబూ నిత్య కల్యాణ్… చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ… మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే… అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్ జీవిత చరిత్ర బాగా చదువుకో!”
ఇలా సాగాయి మంత్రి అమర్నాథ్ ట్వీట్లు. పవన్ అంటే ఓ పోకిరీగా చూపే ప్రయత్నంలో భాగంగానే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు పవన్ పెళ్లిళ్లు, అన్న, తండ్రి పరువు గురించి విమర్శించాల్సిన సందర్భం ఏంటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచే కుట్రలో భాగంగానే మంత్రులు ఆయన పర్సనల్ లైఫ్‌ను టచ్ చేస్తున్నారని జనసేన నేతలు వాపోతున్నారు. అయితే పబ్లిక్ లైఫ్‌లో ఉంటే, తప్పక తప్పిదాలను నిలదీస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.