హీరోయిన్ల బ్యాగ్స్ ఎప్పుడూ బరువుగా ఉంటాయి. ఈ విషయంలో ఒక్కో హీరోయిన్ కు ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది. తమ బ్యాగ్ లో ఎక్కువగా ఏం దాచుకుంటామనే విషయంపై ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు రియాక్ట్ అయ్యారు. తాజాగా ఈ లిస్ట్ లోకి హన్సిక కూడా చేరింది. తన హ్యాండ్ బ్యాగ్ లో వస్తువులు పెద్దగా మారవని, కానీ తన హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఎప్పటికప్పుడు మారుతుందని అంటోంది ఈ చిన్నది.
“ప్రతి సోమవారం నేను నా హ్యాండ్ బ్యాగ్ మారుస్తాను. ఎందుకంటే నా దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి. ప్రతి బ్యాగ్ కు ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఇస్తాను. నా వస్తువులు మోసే ఛాన్స్ కల్పిస్తాను.”
ఎవరైనా పెంపుడు కుక్కలకు ముద్దుపేర్లు పెట్టుకుంటారు. కానీ హన్సిక మాత్రం తన హ్యాండ్ బ్యాగ్స్ కు కూడా ముద్దుపేర్లు పెట్టుకుంటుంది. బ్యాగ్స్ ను ముద్దు పేర్లతో పిలవడం తనకు చాలా ఇష్టం అంటోంది ఈ ఆపిల్ బ్యూటీ.
ఇక బ్యాగ్ లో ఎక్కువగా ఏం క్యారీ చేస్తారనే విషయంపై స్పందిస్తూ.. కరోనా కాలం కాబట్టి ఒకటికి రెండు మాస్కులు, ఓ శానిటైజర్ మస్ట్ గా పెట్టుకుంటానని చెబుతోంది హన్సిక. వీటితో పాటు ఓ 5 రకాల పెర్ఫ్యూమ్స్, మినీ మేకప్ కిట్ ఉంటుందట. ఇక తన పర్సు కూడా హ్యాండ్ బ్యాగ్ లోనే ఉంటుందని.. ఆ పర్సులో డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్-డెబిట్ కార్డులు, కొంత డబ్బుతో పాటు అమ్మ ఫొటో కూడా ఉంటుందని అంటోంది హన్సిక.
ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ఇల్లంతా తన హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుందని చెబుతోంది. హ్యాండ్ బ్యాగ్ చేతిలో ఉంటే తనకు ఇంకేం అక్కర్లేదని చెబుతున్న హన్సిక.. ఆహార పదార్థాలు మాత్రం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టనని అంటోంది. కనీసం చాక్లెట్ కూడా ఉంచనని చెబుతోంది