ఏజెంట్ దెబ్బ.. సురేందర్ రెడ్డి పరిస్థితేంటి?

ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది. కచ్చితంగా దర్శకుడిపైనే ఉంటుంది. మరీ ముఖ్యంగా నిర్మాత, హీరో కలిసి దర్శకుడిపై ఫ్లాప్ భారాన్ని…

ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది. కచ్చితంగా దర్శకుడిపైనే ఉంటుంది. మరీ ముఖ్యంగా నిర్మాత, హీరో కలిసి దర్శకుడిపై ఫ్లాప్ భారాన్ని మోపడంతో, ఇప్పుడు సురేందర్ రెడ్డి కార్నర్ అయ్యాడు.

ఏజెంట్ సినిమా రిలీజ్ అయిన వెంటనే నిర్మాత అనీల్ సుంకర స్పందించాడు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లామంటూ, సురేందర్ రెడ్డిపై మొదటి రాయి వేశాడు. తాజాగా అఖిల్ కూడా స్పందించాడు. అసలు పేరు కూడా ప్రస్తావించకుండా, పరోక్షంగా సురేందర్ రెడ్డిని బ్లేమ్ చేశాడు.

నిర్మాత-హీరోల రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ.. ఫ్లాప్ ఎఫెక్ట్ ఎక్కువగా దర్శకుడికే పడుతుంది. కొరటాల శివ లాంటి దర్శకుడే ఆచార్య ఫ్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. గట్టి ఫ్లాప్ ఇచ్చి ఫేడవుట్ అయిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి కచ్చితంగా సురేందర్ రెడ్డికే సెగ.

దానికి మరింత ఊతమిస్తూ.. సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్ రద్దు చేసుకున్నాడంటూ ఫీలర్లు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనే విషయాన్ని పక్కనపెడితే, జరిగే ప్రమాదం మాత్రం వంద శాతం ఉంది.

ఏజెంట్ సినిమా ఫ్లాప్ తో సుంకరకు ఏం కాదు, అతడు ఆల్రెడీ మరో సినిమాపై ఫోకస్ పెట్టాడు. అటు అఖిల్ కు కూడా ఏం కాదు, అతడు కూడా రేపోమాపో నెక్ట్స్ సినిమా పైకి ఎక్కేస్తాడు. ఇక హీరోయిన్ ఎలాగూ గ్లామర్ డాల్ కాబట్టి, వద్దన్నా మరో 2-3 అవకాశాలొస్తాయి, ఇప్పటికే ఓ ఛాన్స్ అందుకుంది సాక్షి వైద్య. ఎటొచ్చి దర్శకుడు సురేందర్ రెడ్డికే వెంటనే అవకాశం రావడం కష్టం.

సైరా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు సురేందర్. ఆ తర్వాత ఏజెంట్ కోసం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఏజెంట్ ఫ్లాప్ తో నెక్ట్స్ మూవీ కోసం అనివార్యంగా గ్యాప్ వచ్చేలా కనిపిస్తోంది.